వారంలో ఆ కంపెనీల ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు పెరిగింది, రిలయన్స్ డౌన్

ముంబై: టాప్ 10 కంపెనీల్లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.25 లక్షల కోట్లు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ భారీగా లాభపడ్డాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 861.68 పాయింట్లు(1.86 శాతం) లాభపడింది. సెన్సెక్స్ చివరి సెషన్‌లో ఏకంగా 47,000 మార్కును క్రాస్ చేసి, చివరకు 46,960.69 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 13,760 పాయింట్లకు పైగా ఎగిసింది. గత కొద్ది రోజులుగా సూచీలు భారీ లాభాలు నమోదు చేస్తూ, సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.

రిలయన్స్, హిందూస్తాన్ డౌన్

రిలయన్స్, హిందూస్తాన్ డౌన్

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాల రూ.1,25,229.25 కోట్లు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్షీణించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ గత కొద్ది రోజులుగా రూ.2000 కంటే దిగువన ముగుస్తోంది. గత సోమవారం రూ.2,000కు పైన నుండి పడిపోయి రూ.1998 స్థాయికి పడిపోయింది.

మార్కెట్ క్యాప్ జంప్

మార్కెట్ క్యాప్ జంప్

- గతవారం HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,992.86 కోట్లు క్షీణించి రూ.4,46,174.05 కోట్లకు పెరిగింది.

- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,700.13 కోట్లు పెరిగి రూ.10,74,157.65 కోట్లకు పెరిగింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,642.81 కోట్లు పెరిగి రూ.3,16,481.88 కోట్లకు ఎగిసింది.

- HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.15,996.69 కోట్లు పెరిగి రూ.7,77,119.60 కోట్లకు పెరిగింది.

- ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.11,376.62 ఎగిసి రూ.5,06,777.66 కోట్లకు చేరింది.

- కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.5,622.59 కోట్లు పెరిగి రూ.3,85,870.02కు చేరింది.

- భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.3,573.39 కోట్లు పెరిగి రూ.2,78,560.76 కోట్లకు చేరింది.

- ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.1,324.16 కోట్లు పెరిగి రూ.3,56,853.67 కోట్లకు చేరింది.

వీటి మార్కెట్ డౌన్

వీటి మార్కెట్ డౌన్

- ఇక, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,868.14 కోట్లు క్షీణించి రూ.5,47,846.03 కోట్లకు క్షీణించింది.

- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,463.15 తగ్గి రూ.12,62,975.08 కోట్లకు తగ్గింది.

- ఓ సమయంలో రూ.16 లక్షల కోట్లకు చేరుకున్న రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది.

- అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన టాప్ 10 కంపెనీలుగా వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+