For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.32 లక్షల కోట్లు జంప్

|

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.32 లక్షల కోట్లు పెరిగింది. టాప్ కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.2,32,800.35 కోట్లు ఎగిసింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ గతవారం 1,293.48 పాయింట్లు లేదా 2.20 శాతం లాభపడింది. అంతకుముందువారం టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.80 లక్షల కోట్లు క్షీణించింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. ఈ వారం మాత్రం తిరిగి కోలుకుంది. అంతకుముందువారం 60,000 దిగువకు పడిపోయిన సెన్సెక్స్, ఈ వారం మాత్రం ఈ మార్కును దాటింది.

రిలయన్స్ అదుర్స్

రిలయన్స్ అదుర్స్

గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.93,823.76 కోట్లు లాభపడి రూ.16,93,170.17 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గతవారం భారీగా పెరిగింది. చివరి సెషన్‌లో అయింతే దాదాపు నాలుగు శాతం లాభపడింది. శుక్రవారం సెషన్‌లో 3.76 శాతం (రూ.96.80) ఎగిసిన రిలయన్స్ స్టాక్ రూ.2,669.20 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్‌లలో రిలయన్స్ స్టాక్ దాదాపు 5 శాతం లేదా రూ.126 లాభపడింది. నెల రోజుల్లో 12.55 శాతం లేదా రూ.297.65 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.17 లక్షల కోట్లను తాకింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.1693170.17 కోట్లుగా ఉంది.

ఇవి జంప్

ఇవి జంప్

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.76,200.46 కోట్లు పెరిగి రూ.14,55,687.69 కోట్లకు ఎగిసింది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం తగ్గింది. నాలుగు వారాలుగా పైకీ, కిందకు కదలుతోంది. మొదటిసారి తగ్గి, ఆ తర్వాత పెరిగింది. అంతకుముందు వారం మళ్లీ తగ్గింది. గతవారం మళ్లీ పెరిగింది. గతవారం రూ.24,857.35 కోట్లు తగ్గి రూ.7,31,107.12 కోట్లకు పెరిగింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.12,913.91 కోట్లు ఎగిసి రూ.4,66,940.59 కోట్లకు చేరుకుంది.

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,881.09 కోట్లు పెరిగి రూ.8,87,210.54 కోట్లకు పెరిగింది.

- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.7,403.24 కోట్లు పెరిగి రూ.4,87,388.37 కోట్లకు ఎగిసింది.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,310.14 పెరిగి రూ.4,08,479.47 కోట్లకు పడిపోయింది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,410.4 కోట్లు లాభపడి రూ.4,91,841.14 కోట్లకు చేరుకుంది.

ఇవి డౌన్

ఇవి డౌన్

అదే సమయంలో బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ తగ్గింది.

- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.14,614.46 కోట్లు తగ్గి రూ.6,20,362.58 కోట్లకు క్షీణించింది.

- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,697.38 కోట్లు తగ్గి రూ.3,83,866.29 కోట్లకు చేరుకుంది.

గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు వర్క్ చేశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

English summary

10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.32 లక్షల కోట్లు జంప్ | M cap of eight of top 10 valued firms zooms over Rs 2.32 lakh crore

Eight of the top-10 most valued companies together added a whopping Rs 2,32,800.35 crore in market valuation last week in-tandem with rally in the broader market, with Reliance Industries and Tata Consultancy Services emerging as the biggest gainers.
Story first published: Sunday, October 10, 2021, 17:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X