టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.80 లక్షల కోట్లు డౌన్

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.80 లక్షల కోట్లు క్షీణించింది. ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. దీంతో మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.1,80,534.34 పడిపోయింది. టాప్ టెన్ కంపెనీల్లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే లాభపడ్డాయి. మిగతా స్టాక్స్ నష్టపోయాయి. 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ గతవారం 1,282.89 పాయింట్లు లేదా 2.13 శాతం నష్టపోయింది. గతవారంలో చివరి నాలుగు సెషన్లు మార్కెట్ నష్టపోయింది. ప్రారంభ సెషన్ సోమవారం అతి స్వల్పంగా లాభపడింది. అంతకుముందువారం సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడగా, గతవారం అంతకంటే ఎక్కువగా నష్టపోయింది.

ఈ మార్కెట్ క్యాప్ జంప్

ఈ మార్కెట్ క్యాప్ జంప్

అంతకుముందువారం దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,671.55 కోట్లు లాభపడి రూ.15,74,052.03 కోట్లకు చేరుకుంది. ఈ వారం మరింతగా పెరిగింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.25,294.38 కోట్లు పెరిగి రూ.15,99,346.41 కోట్లకు చేరుకుంది. రేపు స్టాక్ కాస్త లాభపడిన మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16 లక్షల కోట్లకు చేరుకుంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,773.33 క్షీణించి రూ.4,03,169.33 కోట్లకు పడిపోయింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.52,526.53 కోట్లు తగ్గి రూ.13,79,487.23 కోట్లకు క్షీణించింది.

- గతవారం పెరిగిన ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈసారి మళ్లీ తగ్గింది. గతవారం రూ.41,782.4 కోట్లు తగ్గి రూ.7,06,249.77 కోట్లకు క్షీణించింది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.22,643.11 కోట్లు తగ్గి రూ.4,90,430.74 కోట్లకు పడిపోయింది.

- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.21,095.77 కోట్లు క్షీణించి రూ.4,79,985.13 కోట్లకు తగ్గింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.16,438.9 కోట్లు తగ్గి రూ.4,54,026.68 కోట్లకు క్షీణించింది.

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,410.41 కోట్లు తగ్గి రూ.8,76,329.45 కోట్లకు పెరిగింది.

- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.9,222.14 కోట్లు తగ్గి రూ.6,34,977.04 కోట్లకు క్షీణించింది.

- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.6,068.69 కోట్లు ఎగిసి రూ.4,05,970.66 కోట్లకు చేరుకుంది.

- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,415.08 కోట్లు తగ్గి రూ.3,95,563.67 కోట్లుగా నమోదయింది.

టాప్ 10 కంపెనీలు వరుసగా...

టాప్ 10 కంపెనీలు వరుసగా...

గతవారం మార్కెట్లు ఐదు సెషన్లు వర్క్ చేశాయి. టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+