ముంబై: టాప్ 10లోని 8 కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.72,442 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం కూడా ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. అంతకుముందు వరుసగా రెండు వారాల పాటు క్షీణించిన మార్కెట్ ఈ రెండు వారాలుగా పెరుగుతోంది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు, ఆ తర్వాత నష్టపోయి, తిరిగి లాభాల్లోకి రావడంతో పాటు ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. అంతకుముందు వారం టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.94 లక్షల కోట్లు పెరగగా, ఈసారి మాత్రం రూ.72వేల కోట్లు పెరిగింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
భారీగా లాభపడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఉంది. నష్టపోయిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ ఉన్నాయి.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,962.94 కోట్లు పెరిగి రూ.5,85,564.20 కోట్లకు చేరుకుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఎం-క్యాప్ రూ.18,458.26 కోట్లు పెరిగి రూ.11,30,763.01 కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.12,123.8 కోట్లు పెరిగి రూ.8,55,086.25 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,643.53 కోట్లు పెరిగి రూ.3,34,716.18 కోట్లకు చేరుకుంది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,435.47 కోట్లు ఎగిసి రూ.4,62,992.20 కోట్లకు చేరుకుంది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.2,230.82 కోట్లు పెరిగి రూ.4,23,733.91 కోట్లకు చేరింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.939.82 కోట్లు పెరిగి రూ.5,18,265.12 కోట్లకు చేరుకుంది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ డౌన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.25,294.37 కోట్లు క్షీణించి రూ.13,55,784.49 కోట్లకు పడిపోయింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం-క్యాప్ రూ.25,294.37 కోట్లు తగ్గి రూ.3,40,206.19 కోట్లకు పడిపోయింది.

మార్కెట్ క్యాప్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుంది. ఆ తర్వాత వరుసగా TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications