టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,51,456.45 కోట్లు పెరిగింది. అతిపెద్ద గెయినర్‌గా ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిలిచింది. గతవారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 1444.59 పాయింట్లు లేదా 2.52 శాతం ఎగిసింది. గతవారంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు ముందు, తర్వాత సూచీలు పరుగులు పెట్టాయి. అయితే చివరి సెషన్‌లలో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. అయితే వారం మొత్తానికి సూచీలు భారీగానే లాభపడ్డాయి. అంతకుముందు టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ గతవారం రూ.3,09,178.44 కోట్లు క్షీణించింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ జంప్
టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.46,016.2 కోట్లు ఎగిసి రూ.14,11,058.63 కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.33,861.41 కోట్లు లాభపడి రూ.8,44,922.53 కోట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.23,425.29 కోట్లు ఎగిసి రూ.4,67,069.54 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.17,226.59 కోట్లు ఎగిసి రూ.4,31,926.08 కోట్లకు చేరుకుంది.
ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.16,601.55 కోట్లు ఎగిసి రూ.5,59,009.41 కోట్లకు చేరుకుంది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.6,113.36 కోట్లు ఎగిసి రూ.4,73,182.90 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.5,850.48 కోట్లు ఎగిసి రూ.5,42,262.17 కోట్లకు చేరుకుంది.
భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.2,361.57 కోట్లు ఎగిసి రూ.3,95,535.80 కోట్లకు చేరుకుంది.

ఇవి నష్టాల్లో...
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,870.45 కోట్లు తగ్గి రూ.4,53,231.97 కోట్లకు పడిపోయింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,396.57 కోట్లు తగ్గి రూ.15,77,382.90 కోట్లకు పడిపోయింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ICICI బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications