టాప్ టెన్‌లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేన్ గతవారం రూ.1.18 లక్షల కోట్లు పెరిగింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారీ లాభాలు నమోదు చేయడంతో ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలు రూ.1,18,930.01 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.48 లక్షల కోట్లు పడిపోయింది. అంతకంటేముందు కూడా అక్షరాలా రూ.1,42,880.11 కోట్ల సంపద ఇన్వెస్టర్లు కోల్పోయారు. వరుసగా రెండో వారం మార్కెట్లు నష్టాల్లో ముగిసి, ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన అనంతరం గత దీపావళి వారం లాభాల్లోకి వచ్చాయి.
గతవారం 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 760.69 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టపోయింది. గతవారం లాభాలు నమోదు చేసినప్పటికీ, అంతకుముందు పది సెషన్‌లలో మూడు సెషన్లు మాత్రమే లాభపడింది. ఏడు సెషన్లు నష్టపోయింది. గత నెలలో 62వేల పాయింట్లు క్రాస్ చేసి, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ గతవారం 60,000 దిగువకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ 60,000 పాయింట్ల పైన ముగిసింది.

పాజిటివ్ నోట్
గతవారం మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే వర్క్ చేశాయి. ఐతే నవంబర్ 4వ తేదీన(గురువారం) దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించారు. శుక్రవారం దివాళీ బలిప్రతిపాద సందర్భంగా సెలవు రోజు. సంవత్ 2078లో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ ఒక్కరోజే 250 పాయింట్ల వరకు లాభపడింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 62,245.43 పాయింట్లు, 52 వారాల కనిష్టం 41,030.17 పాయింట్లు.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.40,782.04 కోట్లు పెరిగి రూ.12,98,015.62 కోట్లకు పెరిగింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రూ.25,033.54 కోట్లు ఎగిసి రూ.4,73,406.02 కోట్లకు పెరిగింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.17,158.49 కోట్లు లాభపడి రూ.7,18,890.08 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,153.08 పెరిగి రూ.5,24,370.77 కోట్లకు పెరిగింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.7,502.68 కోట్లు ఎగిసి రూ.4,54,304.34 కోట్లకు పెరిగింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.6,978.29 కోట్లు లాభపడి రూ.5,69,458.69 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,453.41 కోట్లు పెరిగి రూ.8,82,981.83 కోట్లగా నమోదయింది. ఈ బ్యాంకు మార్కెట్ క్యాప్ అంతకుముందు మొదటిసారి రూ.9 లక్షల కోట్లు దాటింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,868.48 కోట్లు లాభపడి రూ.4,07,881.48 కోట్లకు పెరిగింది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,612.17 కోట్లు నష్టపోయి రూ.15,85,074.58 కోట్లుకు పడిపోయింది.
- గతవారం తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గగా, కేవలం ICICI బ్యాంకుది మాత్రం పెరిగింది. అయితే ఈసారి మాత్రం తగ్గింది. ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.13,680.32 కోట్లు తగ్గి రూ.5,42,827.39 కోట్లకు పడిపోయింది.
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications