For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.65,176 కోట్లు డౌన్

|

గతవారం టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.65,176.78 కోట్లు క్షీణించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HDFC బ్యాంకు స్టాక్స్ సూచీలను కిందకు లాగాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూనీలీవర్ మాత్రమే భారీగా లాభాలను నమోదు చేశాయి. వ్యాల్యూపరంగా టాప్ 10లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు వారం రూ.1,11,220.5 కోట్లు పెరిగింది. అంతకు ముందు వారం నష్టపోయిన స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ యూని లీవర్స్ ఉండగా, గతవారం ఇవి లాభాల్లో ముగిశాయి.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

వీటి మార్కెట్ క్యాప్ డౌన్

- గతవారం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,400.27 కోట్లు క్షీణించి రూ.1,230,138.03 కోట్లు పెరిగింది.

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,113.03 కోట్లు పడిపోయి రూ.818,313.66 కోట్లుగా ఉంది.

- HDFC ఎం-క్యాప్ రూ.5,837.3 కోట్లు క్షీణించి రూ.4,46,941.10 కోట్లుగా నమోదయింది.

- ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,762.02 కోట్లు క్షీణించి రూ.4,43,404.75 కోట్లకు క్షీణించింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,614.48 కోట్లు తగ్గి రూ.3,62,047.96 కోట్లుగా నమోదయింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్

వీటి మార్కెట్ క్యాప్ జంప్

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్ రూ.3,748.34 కోట్లు క్షీణించి రూ.3,78,894.38 కోట్లకు తగ్గింది.

- కొటక్ మహీంద్రా మార్కెట్ క్యాప్ రూ.3,697.15 కోట్లు క్షీణించి రూ.340,237.26 కోట్లకు తగ్గింది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,004.19 కోట్లు క్షీణించి రూ.6,67,911.74 కోట్లుగా ఉంది.

- అదే సమయంలో రిలయన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ పెరిగింది.

- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.15,785.21 కోట్లు ఎగిసి రూ.1,349,794.23 కోట్లకు చేరుకుంది.

- హిందూస్తాన్ యూనీలీవర్ ఎం-క్యాప్ రూ.9,245.63 కోట్లు పెరిగి రూ.584,695.18 కోట్లకు చేరుకుంది.

టాప్ టెన్ వరుసగా..

టాప్ టెన్ వరుసగా..

టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీ లీవర్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి. 30 షేర్ ఇండెక్స్ గతవారం 440.37 పాయింట్లు లేదా 0.83 శాతం నష్టపోయింది.

English summary

టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.65,176 కోట్లు డౌన్ | M cap of eight of 10 most valued firms falls by Rs 65,176 crore

Eight of the 10 most valued firms witnessed a combined erosion of Rs 65,176.78 crore in the market valuation last week, mainly dragged down by Tata Consultancy Services and HDFC Bank.
Story first published: Sunday, July 4, 2021, 21:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X