టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు పతనం
టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,13,074.57 కోట్లు క్షీణించింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంకులు దారుణంగా తగ్గాయి. టాప్ టెన్ కంపెనీల్లో దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా మార్కెట్ క్యాప్ మాత్రమే పెరిగింది. గత వారం సెలవులు వచ్చాయి. వారంలో సెన్సెక్స్ 473.92 పాయింట్లు లేదా 0.96 శాతం క్షీణించింది.
1
వీటి మార్కెట్ క్యాప్ డౌన్
దేశీయ రెండో అతిపెద్ద కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,054.79 కోట్లు క్షీణించి రూ.11,28,488.10 కోట్లకు పడిపోయింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.15,168.41 కోట్లు తగ్గి రూ.5,61,060.44 కోట్లుగా ఉంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,139.12 కోట్లు తగ్గి రూ.7,65,035.49 కోట్లకు తగ్గింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.14,398.04 కోట్లు తగ్గి రూ.3,38,358.80 కోట్లకు తగ్గింది.
HDFC ఎం-క్యాప్ రూ.13,430.38 కోట్లు తగ్గి రూ.4,36,879.75 కోట్లకు తగ్గింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,844.62 కోట్లు క్షీణించి రూ.3,21,592.05 కోట్లకు తగ్గింది.
హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.8,505.43 కోట్లు క్షీణించి రూ.5,58,445.28 కోట్లకు తగ్గింది
ICICI బ్యాంకు ఎం క్యాప్ రూ.6,533.78 కోట్లు తగ్గి రూ.4,13,243.07 కోట్లుగా ఉంది.

2
వీటి మార్కెట్ క్యాప్ జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ మాత్రమే పెరిగింది.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,518.62 కోట్లు పెరిగి రూ.12,27,855.04 కోట్లుగా నమోదయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర క్రితం సెషన్లో1.23 శాతం ఎగిసింది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,052.66 కోట్లు పెరిగి రూ.3,21,732.25 కోట్లకు చేరుకుంది.
3
టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications