టాప్ 10 మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,93,804.34 కోట్లు పెరిగింది. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ గతవారం భారీగా జంప్ చేయడం కలిసి వచ్చింది. అంతకుముందు టాప్ 10 సంస్థల్లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,90,032.06 కోట్లు పెరిగింది. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడ్డాయి. అంతకుముందు వారం బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 795.40 పాయింట్లు లేదా 1.43 శాతం లాభపడగా, గతవారం సెన్సెక్స్ 2,005.23 పాయింట్లు లేదా 3.57 శాతం లాభపడింది. సెన్సెక్స్ మొదటిసారి గత శుక్రవారం 58,000 మార్కు దాటింది. గతవారానికి ముందు సెన్సెక్స్ 57,000 దిగువన ఉంది. ఆగస్ట్ నెలలో సెన్సెక్స్ ఏకంగా 9 శాతం పెరిగింది.

టాప్ 10 కంపెనీల్లో ఇన్ఫోసిస్ మాత్రమే నష్టపోయింది. మిగతా తొమ్మిది కంపెనీలు లాభాల్లో ముగిశాయి.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,02,382 కోట్లు ఎగిసి రూ.15,14,017.50 కోట్లకు చేరుకుంది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.44,832.5 కోట్లు ఎగిసి రూ.14,20,935.10 కోట్లకు చేరుకుంది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.35,342.16 కోట్లు ఎగిసి రూ.3,61,540.16 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.33,906.91 కోట్లు ఎగిసి రూ.4,54,207.76 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.20,712.29 కోట్లు ఎగిసి రూ.6,49,943.93 కోట్లకు చేరుకుంది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.17,373.55 కోట్లు ఎగిసి రూ.5,02,232.46 కోట్లకు చేరుకుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.17,001.38 కోట్లు ఎగిసి రూ.3,85,007.74 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.14,954.74 కోట్లు ఎగిసి రూ.8,72,362.42 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.7,298.81 కోట్లు ఎగిసి రూ.4,98,290.05 కోట్లకు చేరుకుంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం క్షీణించింది. గతవారం రూ.3,457.12 కోట్లు క్షీణించి రూ.7,21,244.78 కోట్లకు తగ్గింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications