టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.3,09,178.44 కోట్లు క్షీణించింది. గతవారం జనవరి 26 కారణంగా బుధవారం మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన మార్కెట్లు, భారీ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం ఏకంగా 1836.95 పాయింట్లు లేదా 3.11 శాతం నష్టపోయింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం స్టాక్ మార్కెట్ పైన పడింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.53 లక్షల కోట్లు క్షీణించింది. లాభపడిన స్టాక్‌లో కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మాత్రమే ఉంది.

ఎస్బీఐ మాత్రమే లాభాల్లో...
- ఈసారి టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,09,178.44 కోట్లు తగ్గింది.
లాభపడిన స్టాక్‌లో ఎస్బీఐ ఉండగా, మిగతా స్టాక్స్ అన్నీ కుప్పకూలాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.1 లక్ష కోట్లు పడిపోయింది.
ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.18,340.07 కోట్లు ఎగిసి రూ.4,67,069.54 కోట్లకు చేరుకుంది.

ఈ స్టాక్స్ నష్టాల్లో
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,512.22 కోట్లు తగ్గి రూ.15,79,779.47 కోట్లకు పడిపోయింది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.53,488.29 కోట్లు పడిపోయి రూ.13,65,042.43 కోట్లకు తగ్గింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,392.63 కోట్లు తగ్గి రూ.7,08,751.77 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,815.01 కోట్లు తగ్గి రూ.8,11,061.12 కోట్లకు పడిపోయింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,333.64 కోట్లు నష్టపోయి రూ.4,14,699.49 కోట్లకు చేరుకుంది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,291.53 కోట్లు తగ్గి రూ.5,42,407.86 కోట్లకు పడిపోయింది.
- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.15,814.77 కోట్లు క్షీణించి రూ.3,93,174.23 కోట్లకు చేరింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,319.96 తగ్గి రూ.4,56,102.42 కోట్లకు తగ్గింది.
- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.9,210.39 కోట్లు తగ్గి రూ.5,36,411.69 కోట్లకు క్షీణించింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ICICI బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications