M cap of 8 out of top 10: టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు జంప్
గతవారం టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,60,408.24 కోట్లు పెరిగింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,22,591.01 కోట్లు పెరగగా, దానికంటే ముందు వారం రూ.96,642 కోట్లు క్షీణించింది. ఇప్పుడు వరుసగా రెండో వారం టాప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.
హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ బెంచ్ మార్క్ గతవారం 1,159.57 పాయింట్లు లేదా 2.13 శాతం లాభపడింది. అంతకుముందు వారం కూడా ఏకంగా 1690.88 పాయింట్లు లేదా 3.21 శాతం ఎగిసిపడింది. సెన్సెక్స్ ఆగస్ట్ 5వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం 54,717 పాయింట్లను తాకగా, ఈసారి 55,000 మార్కును కూడా దాటింది. సెన్సెక్స్ 55,437.29 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

- టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.56,133.1 కోట్లు ఎగిసి రూ.12,80,574.59 కోట్లకు చేరుకుంది. మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో అత్యధికంగా లాభపడింది టీసీఎస్.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,310.7 కోట్లు లాభపడి రూ.13,59,652.06 కోట్ల వద్ద ముగిసింది.
- ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,521.63 కోట్లు ఎగబాకి రూ.7,26,419.85 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు ఎం-క్యాప్ రూ.17,370.86 కోట్లు లాభపడి రూ.8,43,703.53 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాప్ రూ.13,304.96 కోట్లు ఎగిసి రూ.4,88,217.12 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.7,671.41 కోట్లు ఎగిసి రూ.5,64,782.42 కోట్లకు చేరుకుంది.
- ICICI బ్యాంకు ఎం-క్యాప్ రూ.5,321.09 కోట్లు పెరిగి రూ.4,88,352.01 కోట్లకు పెరిగింది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.1,774.49 కోట్లు లాభపడి రూ.3,54,482.60 కోట్లకు చేరుకుంది.
- అదే సమయంలో బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా మార్కెట్ క్యాప్ క్షీణించింది.
- బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.4,288.54 కోట్లు క్షీణించి రూ.3,71,340.29 కోట్ల వద్దకు చేరుకుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎం-క్యాప్ రూ.3,837.58 కోట్లు తగ్గి రూ.3,84,963.12 కోట్లుగా ఉంది.
- టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications