టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా ఎగిసింది. బజాజ్ ఫైనాన్స్‌లో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులకు మొగ్గు చూపారు. 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,90,571.55 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాప్ పరంగా మొదటి రెండు సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మార్కెట్ క్యాప్ క్రితం వారం తగ్గింది. మిగతా సంస్థల స్టాక్స్ పెరిగాయి. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ లాభపడ్డవాటిలో ముందున్నాయి. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.35,878.56 కోట్లు పెరిగి రూ.2,63,538.56 కోట్లను తాకింది.

HDFC జంప్
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.35,878.56 కోట్లు పెరిగి రూ.2,63,538.56 కోట్లను తాకింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.34,077.46 కోట్లు పెరిగి రూ.7,54,025.75 కోట్లకు పెరిగింది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,989.44 కోట్లు పెరిగి రూ.4,15,761.38 కోట్లకు పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.30,142.34 కోట్లు పెరిగి రూ.3,35,771.38 కోట్లకు చేరుకుంది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ.22,156.31 కోట్లు ఎగిసి రూ.5,14,223.88 కోట్లకు చేరుకుంది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.17,266.84 కోట్లు పెరిగి రూ.2,62,630.53 కోట్లకు చేరుకుంది.

టీసీఎస్, రిలయన్స్ డౌన్
కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.10,520.48 కోట్లు పెరిగి రూ.3,50,501.27 కోట్లకు చేరుకుంది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,540.12 కోట్లు పెరిగి రూ.4,82,783.05 కోట్లుగా ఉంది.
మరోవైపు, రిలయన్స్, టీసీఎస్ సంస్థల మార్కెట్ క్యాప్ తగ్గింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.18,392.74 కోట్లు తగ్గి రూ.13,53,624.69 కోట్లకు పడిపోయింది.
టీసీఎస్ ఎంక్యాప్ రూ.14,090.21 క్షీణించి రూ.10,02,149.38 కోట్లుగా ఉంది.

మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీలు..
గతవారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 1745 పాయింట్లు లేదా 4.16 శాతం లాభపడింది.టాప్ 10 మోస్ట్ వ్యాల్యుబల్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications