8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.50 లక్షల కోట్లు పెరిగింది
టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం 2.50 లక్షల కోట్లు పెరిగింది. అత్యధికంగా లాభపడిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.16.50 లక్షల కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోట్ల మార్కును దాటింది. అంతకుముందువారం టాప్ 10లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.11 లక్ష కోట్లు పెరిగింది. అంతకంటే ముందువారం ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1 లక్ష కోట్లు పెరిగింది. వరుసగా మూడు వారాలుగా మార్కెట్ క్యాప్ పెరుగుతోంది. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ తగ్గింది. గతవారం బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1,490.83 పాయింట్లు లేదా 2.55 శాతం లాభపడింది. టాప్ 10లో ఇన్పోసిస్, విప్రో మాత్రం నష్టపోయాయి.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.46,380.16 కోట్లు పెరిగి రూ.16,47,762.23 కోట్లకు చేరుకుంది.
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,648.81 కోట్లు ఎగిసి రూ.14,25,928.82 కోట్లకు పెరిగింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,273.78 కోట్లు ఎగిసి రూ.4,62,395.52 కోట్లకు చేరుకుంది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,129.34 కోట్లు పెరిగి రూ.8,59,293.61 కోట్లుగా నమోదయింది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,887.38 కోట్లు పెరిగి రూ.5,50,860.60 కోట్లకు చేరుకుంది.

ఇవి కిందకు
- SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,532.42 కోట్లు పెరిగి రూ.4,38,466.16 కోట్లకు ఎగిసింది.
- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.13,333.93 కోట్లు ఎగిసి రూ.5,67,778.73 కోట్లకు పెరిగింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,820.06 కోట్లు పెరిగి రూ.4,70,300.72 కోట్లకు ఎగిసింది.
అయితే ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో మార్కెట్ క్యాప్ తగ్గింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,172.98 కోట్లు తగ్గి రూ.7,62,541.62 కోట్లకు క్షీణించింది.
- విప్రో మార్కెట్ క్యాప్ రూ.2,192.52 కోట్లు తగ్గి రూ.3,89,828.86 కోట్లకు పడిపోయింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ICICI బ్యాంకు, HDFC, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విప్రో ఉన్నాయి.


Click it and Unblock the Notifications