గతవారం టాప్ 10 కంపెనీల్లోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,15 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. అంతకుముందు వారం టాప్ 10 కంపెనీల్లోని 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,39,566.52 కోట్లు పెరిగింది. కొన్ని నెలలుగా అంతగా రాణించని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు వారాలుగా భారీగా ఎగిసింది. అంతకుముందు వారం బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 882.40 పాయింట్లు లేదా 1.74 శాతం లాభపడగా, గత వారం 677.17 పాయింట్లు ఎగిసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.60,668.47 కోట్లు ఎగిసి రూ.13,88,718.41 కోట్లకు పెరిగింది. రిలయన్స్ షేర్ దాదాపు రెండు నెలల తర్వాత రెండు వారాలుగా రాణిస్తోంది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.23,178.02 కోట్లు పెరిగి రూ.3,61,767.29 కోట్లకు పెరిగింది.
HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.14,521.98 కోట్లు పెరిగి రూ.4,72,940.60 కోట్లకు పెరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.10,307.93 కోట్లు పెరిగి రూ.3,86,971.16 కోట్లకు పెరిగింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ గతవారం రూ.4,428.97 కోట్లు పెరిగి రూ.5,50,191.47 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాప్
కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2,002.21 కోట్లు పెరిగి రూ.3,58,851.88 కోట్లకు పెరిగింది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.791.24 కోట్లు పెరిగి రూ.8,28,341.24 కోట్లకు పెరిగింది.
అదే సమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ తగ్గింది.
అదే సమయంలో హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ క్షీణించింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.8,351.83 కోట్లు తగ్గి రూ.5,90,252.27 కోట్లకు తగ్గింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.351.41 కోట్లు తగ్గి రూ.11,62,667.33 కోట్లకు క్షీణించింది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.208.16 కోట్లు తగ్గి రూ.4,44,963.18 కోట్లకు తగ్గింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications