అమెరికాలో ఇల్లు కొనుగోలు అనేది చాలామంది తమ డ్రీమ్ గా భావిస్తుంటారు. అమెరికాలో సొంత ఇల్లు ఉంటే ఏదో పెద్ద విజయాన్ని సాధించినట్లు ఫీలవుతుంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా అది మారిపోయింది. అమెరికాలో కోటీశ్వరులు ఇల్లు కొనుగోలుకు అలసు ఆసక్తి చూపడం లేదు. ఇల్లు కొనడం కంటే అద్దె ఇళ్లు తీసుకోవడమే చాలా బాగుందని చెబుతున్నారు. దీంతో అక్కడ ఇల్లు కొనే మిలియనీర్లు కంటే అద్దెకు ఉన్న మిలియనీర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఇది సరికొత్త ట్రెండ్ గా మారింది.
RentCafe అనే నివేదిక ప్రకారం.. 2010 నుంచి 2015 మధ్య కాలంలో అద్దెకు ఉంటున్న కోటీశ్వరుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఇక 2018 నుంచి 2022 వరకు ఏడాదికి 7.5 లక్షల డాలర్ల కంటే ఎక్కవ సంపాదించే వారిలో దాదాపు 10.5 శాతం మంది ఇల్లు కొనుగోలు చేయడం మానేశారు. వారంతా అంత సంపాదిస్తున్నా అద్దె కొంపల్లో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.

ఈ మార్పుకు అనేక కారణాలు ఉన్నాయి. అమెరికాలో పెరిగిన గృహ ధరలతో పాటు అధిక మార్ట్గేజ్ రేట్లు వల్ల కోటీశ్వరులు ఇంటి కొనుగోలు మీద ఆసక్తి చూపడం లేదు. దీంతో పాటుగా అద్దె ఇళ్లు ఇస్తున్న సౌకర్యం, లగ్జరీ జీవనం వారికి కట్టిపడేస్తున్నాయి. మరో అంశం ఏంటంటే ఇల్లు కొనుగోలు చేసే డబ్బుతో మరిన్ని చోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. పరిమితమైన గృహ సరఫరాతో మార్కెట్లో నెలకొన్న అనిశ్ఛితితో పాటు వ్యక్తిగత ప్రాధాన్యతలు అద్దె ఇంటివైపు వారిని నడిపిస్తున్నాయి.
కోట్లకు అధిపతి అయింనత మాత్రాన ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారనే భావన ఇప్పుడు లేదు. ప్రస్తుతం 30 ఏళ్ల ఫిక్స్‌డ్ మార్ట్గేజ్ రేటు 6-7 శాతం మధ్య ఉంది. అమెరికాలో 1.5 మిలియన్ డాలర్ విలువ గల ఇంటిని కొనాలంటే 20 శాతం డౌన్ పేమెంట్ కట్టాలి. అంటే దాదాపు 300,000 డాలర్లు డౌన్ పేమెంట్ కింద చెల్లించాలి. దీనికి ఈఎమ్ఐలో కన్వర్ట్ చేసినా నెలకు 9 వేల డాలర్లు ఖర్చవుతుంది. టాక్స్, ఇన్సూరెన్స్, యుటిలిటీస్ వంటివి మళ్లీ దీనికి అదనం. ఈ నేపథ్యంలో 2021లో లభించిన 3 శాతం తక్కువ వడ్డీ రేట్లు తిరిగి రావడం అనేది ఈ పరిస్థితుల్లో అసాధ్యం. కాబట్టి, కోట్లాధిపతులు కూడా వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అద్దె ఇంటికే మారుతున్నారు.
ఈ రోజుల్లో అధిక జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కువగా ఆఫీసుకు రావాలని కోరుతున్నాయి. కాబట్టి ఒకే నగరంలో ఇల్లు కొనుగోలు చేసి కట్టుబడి ఉండటానికి చాలా మంది ఇష్టపడటం లేదు. అద్దె ఇళ్లు ఉంటే, కొత్త ఉద్యోగావకాశాలు లేదా వ్యాపార అవకాశాల కోసం సులభంగా మారిపోవచ్చు. HomeLight నివేదిక ప్రకారం.. ఒక ఇల్లు అమ్మడానికి సగటున 66 రోజులు పడుతుంది. అప్పుడు కూడా అమ్మకం అవుతుందని గ్యారంటీ లేదు. ఆ కాలంలో సమయం అంతా వృథా అవుతుంది.కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ అని కోటీశ్వరులు భావిస్తున్నారు.
ఇక లగ్జరీ అద్దె అపార్ట్మెంట్స్‌లో కన్సియర్ సేవలు, ఆధునిక జిమ్‌లు, రిసార్ట్ స్టైల్ సౌకర్యాలు ఉంటాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే డెట్రాయిట్‌లోని ది రెసిడెన్సెస్ ఎట్ బుక్ టవర్లో కో-వర్కింగ్ స్పేస్‌లు, ప్రైవేట్ మీటింగ్ రూమ్‌లు, ఫుడ్ సర్వీసులు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. హోమ్ మెయింటెనెన్స్ ఇబ్బందులు లేకుండా..లగ్జరీ అనుభవం కలిగించడం వల్ల అద్దె ఇళ్లు ఇప్పుడు కోటీశ్వరులకు కూడా ఆకర్షణీయంగా మారుతున్నాయి. కాబట్టి కోట్లాధిపతులకు ఇల్లు కొనుగోలు తప్పనిసరి పెట్టుబడిగా కనిపించడం లేదు. వారికి మార్కెట్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలు ఇప్పుడు ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. తమ డబ్బును స్టాక్ మార్కెట్, ప్రైవేట్ ఈక్విటీ లేదా వ్యాపారాల్లో పెట్టడం ద్వారా ఎక్కువ లాభాలు సాధిస్తున్నారు.
ఇల్లు కొనుగోలు చేయడం అంటే మొదట భారీ డౌన్ పేమెంట్, క్లోజింగ్ ఫీజులు, ప్రాపర్టీ టాక్స్‌లు, రిపేర్స్ లాంటి ఖర్చులు భారీగా వస్తాయి. అదే ఆ డబ్బును వ్యాపారాలు, స్టార్టప్స్ లేదా ఫిలాంత్రోపిక్ ప్రాజెక్ట్స్‌లో పెట్టి ఎక్కువ ఫలితాలు పొందగలరని వారు భావిస్తున్నారు. 2024 చివరికి అమెరికాలో 3.7 మిలియన్ గృహాల కొరత ఉందని ఫ్రెడ్డి మాక్ చెబుతోంది. కోట్లాధిపతులు తాము కోరుకున్న విధంగా ఇళ్లు దొరకకపోవడంతో.. తాత్కాలికంగా అద్దె ఇళ్లు తీసుకోవడం ఇష్టపడుతున్నారు. కస్టమ్ బిల్డింగ్ సమయం, డిజైన్, అనుమతులు మొదలైనవి కలిపితే సొంతిల్లు కల సాకారం కావాలంటే సంవత్సరాలు పడుతుంది. భూమి కొనడం, అనుమతులు పొందడం, డిజైన్‌లు పూర్తి చేయడం, స్మార్ట్ హోమ్ టెక్నాలజీలు అమలు చేయడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అందుకు వారు అంతగా ఆసక్తి చూపడం లేదు.
కొంతమంది అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు లేదా ముందుగానే రిటైర్ కావాలని అనుకుంటారు. మరికొందరు అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇల్లు కొనడం కంటే అద్దె ఇల్లు ఉండడం ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది.ఇల్లు కొనుగోలు అంటే ఆర్థికంగా కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇల్లు కొనుగోలు అనేది వారికి పెద్దగా రుచించడం లేదు. రాబోయే సంవత్సరాల్లో ఇది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాలి.
More From GoodReturns

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!



Click it and Unblock the Notifications