దూకుడుమీదున్న లగ్జరీ రియల్టీ సేల్స్.. ఇంకా నాలుగు రోజులే ఛాన్స్.. మారిపోయిన రెండు రూల్స్

Real Estate: ఇటీవల కేంద్రం తన వార్షిక బడ్జెట్లో చేసిన ఒక ప్రకటన వల్ల దేశంలో రియల్టీ రంగంలో పెనుమార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగా ప్రస్తుతం లగ్జరీ ప్రాపర్టీల విక్రయాలు మంచి జోరుమీదున్నాయి. కొన్ని చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిన తరుణంలో ఈ కొనుగోలు బూమ్ మరో నాలుగు రోజులు కనిపించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం సెక్షన్ -54, 54F లకు చేసిన సవరణలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పు కారణంగా అధిక నెట్‌వర్త్ కలిగి ఉన్న వ్యక్తులు తమ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ బాధ్యతను తగ్గించుకోవడానికి గరిష్ఠ పరిమితిని రూ.10 కోట్లకు పరిమితం కానుంది. దీంతో చాలా మంది మార్చి నెలాఖరు నాటికి తమ క్రయవిక్రయాలను పూర్తి చేయాలని హడావిడిగా ఉన్నారు. ఈ క్రమంలో రూ.5 కోట్లు, అంతకు మించి విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 2023 ముంబైలో సంవత్సరానికి 29 శాతం పెరిగిందని తెలుస్తోంది.

ఏప్రిల్ 1లోపు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది హెచ్‌ఎన్‌ఐలు తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆ రోజు నుంచి రెసిడెన్షియల్ కొనుగోలుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఉన్నందున రాబోయే కొద్ది రోజుల్లో హై-ఎండ్ లగ్జరీ డీల్స్ రిజిస్టర్ అవుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. HNIలు ఖరీదైన లగ్జరీ గృహాలను కొనుగోలు చేసిన తర్వాత టాక్స్ తగ్గింపులను భారీ మెుత్తాలను క్లెయిమ్ చేయకుండా నిరోధించేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.

Luxury realty sales in boom amid union budget 2023 amended rules for capping on capital gains tax deductions

చట్టాల్లో మార్పులు ప్రకటించిన తర్వాత టుఫ్రోప్స్ డైరెక్టర్ మాధవ్ గోయెల్ మార్చి 23న మలబార్ హిల్‌లోని సముద్రానికి ఎదురుగా ఉన్న లోధా మలబార్ ప్రాజెక్ట్‌లో 9,546 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ.121 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో వీఆర్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలో రూ.49.75 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేసింది. లావాదేవీ మార్చి 1, 2023న రిజిస్టర్ చేయబడింది. బజాజ్ ఆటో ఛైర్మన్ నిరజ్ బజాజ్ ప్రాజెక్ట్ 18,008 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.252.50 కోట్ల మార్చి 10న కొనుగోలు చేశారు.

రూ. 1,238 కోట్ల విలువైన 28 హౌసింగ్ యూనిట్లను డిమార్ట్ చైన్ ఆఫ్ స్టోర్‌లను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమాని కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే వెల్స్పన్ గ్రూప్ ఛైర్మన్ బికె గోయెంకా రూ.230 కోట్లకు పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. ఇలా అనేక మంది సంపన్నులు ముందస్తుగా లగ్జరీ గృహాలను కొనుగోలు చేసి పన్ను తగ్గింపులను పొందేందుకు ప్లాన్ చేసుకున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+