JK House: అంబానీ ఆంటీలియా సరే, మరి JK హౌస్ గురించి తెలుసా.. ఈ నిర్మాణ వైభవం వివరాలివిగో..
Costliest Houses: ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ నివాసం ఆంటీలియా గురించి పలు వార్తలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దాని విలువ దాదాపు 15 వేల కోట్లని నివేదికలు చెబుతున్నాయి. ఇంటి కోసం ఈ స్థాయిలో ఖర్చుపెట్టడం అవసరమా అనేవారు కొందరుండగా.. అంబానీ ఫ్యామిలీ కాకుండా ఈ రేంజ్ ఇల్లు కలిగిన వారు ఎవరని మరికొందరు సెర్చ్ చేస్తున్నారు.
ముంబైలోని బ్రీచ్ క్యాండీ పరిసరాల్లో ఉన్న JK హౌస్.. అంబానీకి చెందిన ఆంటీలియా తరువాతి స్థానంలో నిలుస్తోంది. విలాసవంతమైన నిర్మాణ వైభవానికి ఇది పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఈ ప్రాపర్టీ ఓనర్ మరెవరో కాదు రేమండ్ గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా. ఈ విశాలమైన నివాసం 30 అంతస్తులను కలిగి ఉంది.

JK హౌస్ విలువ 6 వేల కోట్లని తెలుస్తోంది. ముంబైలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాపర్టీలలో ఒకటిగా ఉంది. గౌతమ్ సింఘానియా నికర ఆస్తి విలువ 11 వేల 635 కోట్లలో ఇదీ ఒక భాగం. ఇంటిలో భాగంగా ఇక్కడ ఒక రేమండ్ షోరూమ్ ఉంటుంది. రేమండ్ స్థాపకులు, గౌతమ్ సింఘానియా తాతగ లాలా కైలాష్‌పత్ సింఘానియాకు నివాళిగా 45-అడుగుల ఎత్తైన పాలరాతి కట్టడాన్ని ఈ భవంతిలో చూడవచ్చు.
ఫాబ్రిక్ వ్యాపారంలో సింఘానియా కుటుంబం శతాబ్దాల నాటి ప్రయాణాన్ని వివరించే ప్రైవేట్ మ్యూజియం, స్పా మరియు వెల్నెస్ సెంటర్, ప్రైవేట్ జెట్‌ల కోసం హెలిప్యాడ్, అత్యాధునిక జిమ్, హోమ్ థియేటర్, విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్స్ వంటి పలు సౌకర్యాలు JK హౌస్‌లో ఉన్నాయి. 5 అంతస్తులలో విస్తరించి ఉన్న పార్కింగ్ సదుపాయం తప్పక ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఇందులో ఆయన అద్భుతమైన లగ్జరీ వాహనాల సేకరణ ఉంది. వీటిలో లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్‌లెగ్గేరా, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా మరియు ఆడి క్యూ7 వంటి కార్లు ఉన్నాయి .


Click it and Unblock the Notifications