Lulu mall: దేశంలో అతిపెద్ద లులూ మాల్.. ఆ నగరంలో యువతకు జాబుల జాతరే
Biggest malls: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పలు రాజకీయ ఆరోపణలకు కారణమైన లులూ మాల్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి పొలిటికల్ రంగుతో కాదు. ఇప్పటికే హైదరాబాద్‌లో అతిపెద్ద మాల్ ద్వారా భాగ్యనగరవాసులకు సేవలందిస్తున్న సదరు సంస్థ.. దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. ఇండియాలో అతిపెద్ద మాల్‌ను ప్రారంభించింది.
కేరళకు చెందిన వ్యాపారవేత్త మరియు ఎమిరాటీ బేస్డ్ బహుళజాతి సమ్మేళనం లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ MA యూసఫ్ అలీ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలోని UAE-ఇండియా బిజినెస్ ఫోరమ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు.

'అబుదాబి యువరాజు చారిత్రాత్మక పర్యటన భారతదేశం మరియు UAE వ్యాపారవేత్తలు తమ బిజినెస్‌లు మెరుగుపరచుకోవడానికి మరియు సహకరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. క్రౌన్ ప్రిన్స్ మరియు PM నరేంద్ర మోదీ సోదర భావంతో మెలుగుతున్నారు. మేము భారత్‌లో ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు పెట్టాము. ప్రస్తుత వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. త్వరలోనే అహ్మదాబాద్‌లో ఇంయాలో అతిపెద్ద షాపింగ్ మాల్‌ను ప్రారంభిస్తాము' అని స్పష్టం చేశారు.
4 వేల కోట్లతో భారత్‌లో అతిపెద్ద లులూ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది అలీ వెల్లడించారు. హైదరాబాద్‌లో 300 కోట్లతో నిర్మించిన మాల్ వల్ల దాదాపు 2 వేల మంది ఉపాది పొందుతున్నారు. కాగా ఇప్పుడు అహ్మదాబాద్ మాల్ ద్వారా కనీసం 4 వేల మంది యువతకు జాబ్స్ వస్తాయని అంచనా. వీటితో పాటు రానున్న రోజుల్లో కాశ్మీర్ మరియు నోయిడాలో ఫుడ్ ప్రాసెసింగ్‌తో సహా ఇతర రంగాలలోకి సైతం విస్తరించాలని లులూ గ్రూప్ చూస్తోందని యూసఫ్ అలీ తెలిపారు.


Click it and Unblock the Notifications