Lulu Group: కేరళలో రుణం చెల్లించలేదని ఇంటి నుంచి గెంటివేయబడిన మహిళకు సహాయం చేసేందుకు లులు గ్రూప్ యజమాని ఎంఏ యూసుఫ్ అలీ ముందుకు రావటం వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. కోటీశ్వరుడు యూసుఫ్ కేరళలోనే జన్మించి ప్రస్తుతం దేశంతో పాటు విదేశాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిదే. అప్పులతో సతమతమౌతూ వాటిని తీర్చలేకపోయిన మహిళ రుణాలను తిరిగి చెల్లించే బాధ్యతను బిలియనీర్ తీసుకున్నారు.
దీనికి సంబంధించి సదరు మహిళ చెల్లించాల్సిన డబ్బును తన బృందాన్ని పంపి ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఆమెకు అదనంగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఇది పెద్ద సంచలనంగా మారింది. వార్తా కథనాల ప్రకారం కేరళకు చెందిన సంధ్య అనే మహిళ, ఆమె భర్త నార్త్ పరవూర్‌లో తమ ఇల్లు కట్టుకోవడానికి 2019లో ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నారు. కేరళకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ మణప్పురం ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.4 లక్షల రుణం తీసుకున్నారు. 2021లో సంధ్యను, ఇద్దరు పిల్లలను భర్త విడిచిపెట్టాడు. దీంతో ఆమె రుణాన్ని చెల్లించలేని స్థితికి చేరుకోగా వడ్డీతో కలిపి అది రూ.8 లక్షలకు చేరుకుంది.

మణప్పురం ఫైనాన్స్ రుణ డిఫాల్ట్ కారణంగా ఇంటి జప్తు ప్రక్రియను ప్రారంభించింది. సంధ్యకు మూడేళ్ల క్రితం రుణం ఎగవేసినందుకు నాలుగు వార్నింగ్‌లు ఇచ్చామని సదరు ఫైనాన్స్ కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే ఇటీవల సదరు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంట్లోకి చొరబడి.. సంధ్య, ఆమె పిల్లలను బయటకు గెంటేశారు. కనీసం ఇంట్లోని వస్తువులను తీసుకోవటానికి కూడా అనుమతించలేదు. దీంతో ఆమె పిల్లలతో కలిసి రోడ్డుపై పడుకోవటం అక్కడి స్థానికులను కలచివేసింది. దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలో ప్రసారం కావటంతో అది లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై స్పందించిన బిలియనీర్ సదరు మహిళకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
సంధ్య తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని యూసుఫ్ అలీ తన బృందానికి సూచించినట్లు సమాచారం. దీంతో లులు గ్రూప్ మీడియా కోఆర్డినేటర్ స్వరాజ్ సంధ్య, ఆమె కుటుంబ సభ్యులకు ఇంటి తాళాలను తిరిగి అప్పగించారు. అలాగే అదనపు సాయంగా ఇచ్చిన రూ.10 లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించడానికి అందించారు. ఈ సాయంపై సంధ్య లులు గ్రూప్ అధినేత కృతజ్ఞతలు చెబుతూ యూసుఫ్ అలీ లేకుంటే తాను, తన పిల్లలు చాలా కష్టాల్లో ఉండేవారమని పేర్కొన్నారు. ధనవంతులు కష్టాల్లో ఉన్న వ్యక్తులకు సాయం అందించటం దేశంలో కాక విదేశాల్లోను పెద్ద చర్చకు దారితీస్తోంది. పైగా యూసుఫ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications