Chandrababu Naidu: ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న లులు గ్రూప్ తాజా మరో సారి ఏపీలో పెట్టుబడి గురించి ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో లులు గ్రూప్ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి లులు గ్రూప్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో శనివారం చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఏపీలో వారి పెట్టుబడికి సంబంధించిన ఇతర ప్లాన్లను సైతం పంచుకున్నారు. తాజా చర్చల ప్రకారం వైజాగ్‌లో మాల్, మల్టీఫ్లెక్స్, హైపర్ మార్కెట్ ఏర్పాటు తోపాటు.. విజయవాడ, తిరుపతిలో మల్టీఫ్లెక్స్‌ల నిర్మాణంపై చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సానుకూలంగా చర్చలు జరిగాయని అన్నారు.

దీనికి ముందు 2014-19 మధ్య కాలంలో అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో లులు గ్రూప్ వైజాగ్‌లోని బీచ్ రోడ్డులో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీకి టీడీపీ ప్రభుత్వం భూములు సైతం కేటాయించింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ 2019 నవంబరులో లులు గ్రూప్ కు కేటాయించబడిన భూములను తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు, కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
లులూ గ్రూప్ 2019లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2018లో మెగా కన్వెన్షన్ సెంటర్‌కు పునాది వేసింది. గత టీడీపీ ప్రభుత్వం లులు గ్రూప్‌కు భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ జగన్ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టబోయేది లేదని తేల్చి చెప్పినప్పటికీ.. కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తిరిగి పెట్టుబడి చర్చలు తెరమీదకు వచ్చాయి. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడంతో.. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ సిద్ధమౌతోంది.
కూటమి ప్రభుత్వం తన పాత పరిచయాలను తిరిగి యాక్టివేట్ చేస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇవి కొత్త పెట్టుబడులను తక్కువ సమయంలోనే తీసుకురావటానికి దోహదపడుతోంది. దీనికి తోడు కేంద్రం నుంచి మంచి సహకారం కూడా అందుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications