మహాకుంభమేళాలో మెరిసిన అదృష్టం, 1 రోజులో లక్ష కప్పుల టీ, ఇప్పుడు IPO రెడీ..
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా చాయ్ పాయింట్(Chai Point) భారీ విజయాన్ని సాధించింది. ఈ కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ స్టోర్ల ద్వారా ఒక్క రోజులో లక్ష కప్పులకు పైగా టీలని అమ్మింది. ఇది బ్రాండ్ ప్రజాదరణను పెంచింది. చాయ్ పాయింట్ ఒక పాపులర్ టీ కేఫ్ చైన్. అలాగే స్టాక్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించుకోవడానికి కూడా సిద్ధమవుతోంది.
దీని సహ వ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా ఈ విషయాన్ని ప్రకటించారు. 2009లో ముంబైలోని ఒక కేఫ్‌లో టీ తాగుతున్న హార్వర్డ్ ప్రొఫెసర్ ఖన్నా అండ్ అతని విద్యార్థి అమూల్య సింగ్ బిజ్రాల్‌కు ఈ ఆలోచన వచ్చింది. దింతో ప్రజలకు మంచి నాణ్యత గల, శుభ్రమైన ఇంకా చౌకైన టీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

చాయ్ పాయింట్ మే 2026లో IPO ప్రారంభించాలని యోచిస్తోంది. కంపెనీ వ్యాపార నమూనా ఫ్రాంచైజ్ ఆధారితమైనది కాదు, కంపెనీ యాజమాన్యంలో ఉంది. అయితే కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది. కానీ, ఇప్పుడు తిరిగి వృద్ధి బాటలో పయనిస్తోంది. 'ఇండియా రన్స్ ఆన్ చాయ్' అనే నినాదంతో చాయ్ పాయింట్ కేవలం టీ కంపెనీ మాత్రమే కాదు, దేశ ప్రతిఒక్కరి నిత్య జీవితంలో ఒక భాగం. సాంకేతికత ఇంకా సంప్రదాయాన్ని కలపడం ద్వారా భారతదేశంలో టీ అనుభవాన్ని తిరిగి ఆవిష్కరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
2009లో ప్రారంభం
చాయ్ పాయింట్ 2009లో ప్రారంభించారు. హార్వర్డ్ ప్రొఫెసర్ తరుణ్ ఖన్నా అతని విద్యార్థి అమూల్య సింగ్ బిజ్రాల్ ముంబైలోని ఒక కేఫ్‌లో టీ తాగుతున్నప్పుడు వారికీ ప్రజలకు మంచి నాణ్యత గల, శుభ్రమైన ఇంకా చౌకైన టీని అందించాలనే ఆలోచన వచ్చింది. ముంబైలో ఒక వ్యక్తి మురికి వాతావరణంలో ప్లాస్టిక్ కప్పుల్లో టీ అమ్ముతుండటం అతను చూశాడు. దీని వల్ల సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు మంచి శుభ్రమైన టీని అందించగల అలాగే టి విక్రేతలకు ఉపాధి అవకాశాలను సృష్టించగల బ్రాండ్‌ను సృష్టించాలనే ఆలోచన వచ్చింది. చాయ్ పాయింట్ మొదటి అవుట్‌లెట్‌ను 2010లో బెంగళూరులోని కోరమంగళలో ప్రారంభించింది.
2012 నాటికి, కంపెనీ బెంగళూరు దాటి ఢిల్లీ, ముంబై ఇంకా పూణేలకు విస్తరించింది. నేడు చాయ్ పాయింట్ భారతదేశం అంతటా 170కి పైగా షాప్స్ ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో మరో 300 దుకాణాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న దుకాణాలలో 60 దుకాణాలు సీటింగ్ ప్రాంతాలతో ఉండగా, మిగిలిన 110 దుకాణాలు వాక్-ఇన్ అవుట్‌లెట్‌లు. ఖన్నా చాయ్ పాయింట్ స్పెషల్ టీ రెసిపీని కోకాకోలా, పెప్సీ వంటి పెద్ద పానీయాల కంపెనీలతో పోల్చాడు. ఈ కంపెనీల లాగానే చాయ్ పాయింట్ కూడా దాని స్వంత రహస్య సూత్రం ఉందని ఆయన అన్నారు. 'ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మ టీ అత్యుత్తమమని భావిస్తున్నట్లే, చాయ్ పాయింట్ టీ ఆ స్కేల్‌లో 8 లేదా 9 స్థానంలో ఉంటుంది' అని అతను అన్నాడు.


Click it and Unblock the Notifications