మహాకుంభ్ ఎల్లప్పుడూ అద్భుతమైన సంఘటనలు, కథలకు కేంద్రంగా ఉంటుంది. అయితే రుద్రాక్ష దండలు అమ్ముతూ తన అమాయకత్వం, ఆకర్షణీయమైన కళ్లతో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన మోనాలిసా, ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతి తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ పాపులారిటీ ఆమెను బాలీవుడ్ వైపు తీసుకెళ్లింది.
'రామ జన్మభూమి', 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్', 'కాశీ టు కాశ్మీర్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాని చూసి ఎంతో ముగ్ధుడయ్యాడు, ఎలాగైన ఆమెను తన సినిమాలో నటించేల చేయాలనీ నిర్ణయించుకోవడమే కాకుండా, ఆమె ఇంటికి వెళ్లి సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించాడు కూడా. అయితే సినిమా ఛాన్స్ తనని వెతుక్కుంటూ రావడంతో బాలీవుడ్ లో సందడి చేసేందుకు మోనాలిసా సిద్ధమైంది.

చిత్ర దర్శకుడు సనోజ్ మిశ్రా తన రాబోయే సినిమా 'డైరీ ఆఫ్ మణిపూర్'లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించేందుకు మోనాలిసా సంతకం చేశారు. దీని కోసం సనోజ్ మధ్యప్రదేశ్‌లోని మోనాలిసా ఇంటికి వెళ్లిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, .
సున్నితమైన సంఘటన ఆధారంగా సినిమా
మణిపూర్‌లో జరిగిన ఓ సున్నితమైన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోనాలిసా కథానాయికగా నటిస్తుంది. సనోజ్ మిశ్రా మాట్లాడుతూ నేను మోనాలిసాను పెద్ద స్క్రీన్‌పై అద్భుతంగా ప్రెజెంట్ చేస్తాను. నేను ఆమె కుటుంబాన్ని కలిశాను కూడా, వారు చాలా సాధారణ ఇంకా అమాయక వ్యక్తులు. మోనాలిసాకు కష్టపడి పనిచేయాలనే అభిరుచి ఉంది, ఆమెకు సరైన దిశానిర్దేశం చేయడం మా బాధ్యత. కష్టపడి పనిచేయడం, అభిరుచి ద్వారానే చిత్ర పరిశ్రమలో విజయాలు వస్తాయని అన్నారు. మొనాలిసా పట్టుదలతో పనిచేస్తే బాలీవుడ్‌లో కొత్త గుర్తింపు వస్తుంది అని అన్నారు.
మోనాలిసా ఖర్గోన్ జిల్లా నివాసి
16 ఏళ్ల మోనాలిసా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా నివాసి. ఆమె అసలు పేరు ఇంకా వెల్లడించలేదు, కానీ ఆమెను ఇంటర్నెట్‌లో 'మహా కుంభ్ గర్ల్' లేదా 'మోనాలిసా' అని పిలుస్తారు. ఆమె ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో రుద్రాక్ష ఇంకా పూసల దండలు అమ్మేది.
సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2025 నుంచి ప్రారంభం కానుందని రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా సనోజ్ వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 20 కోట్ల రూపాయలని అంటున్నారు. షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమై ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని అంచనాలు ఉన్నాయి.
సినిమా షూటింగ్ ఎక్కడ
ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కడ అనే సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మణిపూర్, ఢిల్లీ, లండన్ లో జరగనుంది. ఒక విధంగా మోనాలిసా విదేశాలకు వెళ్లబోతుందనే చెప్పాలి. ఈ సినిమాలో మోనాలిసాతో పాటు రాజ్‌కుమార్ రావు అన్నయ్య నటుడు అమిత్ రావ్ కూడా కనిపించనున్నారు. ఈ సినిమా సమయంలో దర్శకుడు ఇంకా నటుడు మహేంద్ర లోధి, అనూప్ జలోటా వంటి పెద్ద ఆర్టిస్టులతో కలిసి పని చేసే అవకాశం మోనాలిసాకు లభిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications