ఆగస్ట్ నెలలో నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ (లిక్విపైడ్ పెట్రోలియం) గ్యాస్ ధరలు ఆగస్ట్ 1వ తేదీ నుండి మెట్రో నగరాల్లో మారలేదు. కేవలం కోల్‌కతాలో మాత్రమే రిటైల్ సిలిండర్ ధరలు 50 పైసలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రతి నెల మొదటి తేదీన సమీక్షిస్తారనే విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఇంధన రేట్లు, అమెరికా డాలర్, రూపాయి మారకం విలువపై కూడా ఆధారపడి ఉంటాయి.
గత నెలలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో మూడున్నర రూపాయలు పెరిగింది. ఫిబ్రవరిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.858 పెరిగింది. మార్చిలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ పైన కరోనా ప్రభావం పడిన నేపథ్యంలో ధర రూ.805కు తగ్గింది. మే నెలలో ధరలు మరింత తగ్గిపోవడంతో గ్యాస్ ధరలు రూ.581కు తగ్గింది.

సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.594, కోల్‌కతాలో రూ.621, ముంబైలో రూ.594, చెన్నైలో రూ.610.50గా ఉంది. వినియోగదారులంతా మార్కెట్ ధరకే ఎల్పీజీ సిలిండర్లను కొనుగోలు చేయాలి. ప్రభుత్వం సబ్సిడీని నేరుగా అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లోకి బదలీ చేస్తుంది. అర్హులకు ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీపై అందిస్తుంది.
More From GoodReturns

PNGకి మారకపోతే ఇళ్లకు LPG నిలిపివేత..కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు

LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

Gas Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా రావడం లేదా? అయితే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications