గ్యాస్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సిలిండర్ ధర తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే!
LPG prices: ప్రతి నెల 1వ తేదీలాగే ఈసారి కూడా చాలా రూల్స్ మారాయి. వీటితో పాటు ఆయిల్ రిఫైనరీ కంపెనీలు LPG సిలిండర్ ధరలను సవరించాయి. 1st మే అంటే కార్మిక దినోత్సవం రోజున చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.14.50 కొత విధిస్తు కస్టమర్లకు గొప్ప రిలీఫ్ అందించాయి. అయితే ధర తగ్గింపు తర్వాత మే 1 నుండి వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1747.50కి పడిపోగా, గతంలో దీని ధర రూ.1762 ఉండేది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.17 తగ్గి రూ.1851.50కి చేరుకుంది.

ఆలస్యంగా మార్పులు : మరోవైపు ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.1713.50గా ఉన్న సిలిండర్ ధర రూ.1699 చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో సిలిండర్ ధర రూ.1921.50 నుండి రూ.1906 కి దిగొచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. కానీ ఈసారి ఈ మార్పు ఉదయం 7.30 గంటల సమయంలో జరిగింది. దీని వల్ల చమురు కంపెనీలు 1వ తేదీ నుండి కాకుండా 2వ తేదీ నుండి ఈ మార్పులు చేయవచ్చని తెలుస్తుంది. మరోవైపు, వంటింటి గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. గ్యాస్ కంపెనీలు ఏప్రిల్ 8న వీటి ధరల్లో కోత విధించాయి.
వంటింటి సిలిండర్ ధరలు: తాజగా ఢిల్లీలో 14 కిలోల LPG సిలిండర్ ధర రూ.853కి చేరగా, కోల్‌కతాలో రూ.879కి, ముంబైలో రూ.852కి ఇంకా చెన్నైలో రూ.868.50గా ఉంది. మే 1 నుండి చమురు కంగా పెనీలు విమాన ఇంధన ధరలను కూడా మార్చాయి. ఢిల్లీలో దీని కొత్త ధర లీటరుకు $768.09గా తగ్గింది. అలాగే కోల్‌కతాలో లీటరుకు $806.46, ముంబైలో లీటరుకు $768.23, చెన్నైలో లీటరుకు $763.34గా ఉంది.
రూ.300 కంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ : ప్రస్తుతం దేశంలో 32.9 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 10.33 కోట్ల మంది ప్రజలు ఉజ్వల యోజనతో లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కింద పేదలకు సిలిండర్ పై రూ.300 సబ్సిడీ లభిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉజ్వల యోజనలో ఎంతో మంది లబ్ధిదారులు ఉన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో అతిపెద్ద పెరుగుదల ఏప్రిల్ 2022లో కనిపించింది. 1 ఏప్రిల్ 2022న, సిలిండర్ ధర రూ.249.50 నుండి రూ.268.50కి పెరిగింది. ఆ సమయంలో సిలిండర్ ధర రూ.2406కి చేరుకుంది. హైదరాబాద్లో 14 కిలోల సిలిండర్ ధర రూ.905, కమర్షియల్ సిలిండర్ ధర రూ.1985.


Click it and Unblock the Notifications