అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురురంగం కంపెనీలు (OMCs) వరుసగా ఇంధన ధరలు పెంచుతున్నాయి. అలాగే, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా సిలిండర్ ధరలు (14.2 కిలోలు) రూ.25 పెంచుతున్నట్లు OMCs గురువారం ప్రకటించాయి. తాజా పెరుగుదలతో డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.794గా ఉంది. కేవలం ఈ ఫిబ్రవరి నెలలోనే సిలిండర్ ధర రూ.100 పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ పెరగడం, దీనికి తోడు చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధించడంతో అంతటా ధరలు పెరుగుతున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరతో పాటు గ్యాస్ భారం
అంతకుముందు ఫిబ్రవరి 4న, ఫిబ్రవరి 14వ తేదీన చమురురంగ కంపెనీలు సిలిండర్ ధరలను పెంచాయి. అంటే 21 రోజుల్లో మూడుసార్లు రూ.100 పెరిగింది. ఇటీవలి కాలంలో ఒక నెలలో సిలిండర్ ధరలు మూడుసార్లు పెరగడం ఇది మొదటిసారి. డిసెంబర్ నుండి గ్యాస్ సిలిండర్ ధరలు రూ.200కు పైగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ.100 పైకి చేరుకుంది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో రూ.90 క్రాస్ చేసింది. ఇదే సమయంలో ఎల్బీజీ కూడా పెరుగుతోంది. నేచరల్ గ్యాస్, క్రూడాయిల్ రిఫైనింగ్ బైప్రాడక్టే ఎల్పీజీ. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగా ఉన్నాయి.

డిసెంబర్‌లో రూ.100, ఫిబ్రవరిలో రూ.100 జంప్
డిసెంబర్ నెలలో రూ.100 పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఫిబ్రవరిలో రూ.100 పెరిగింది. ప్రభుత్వం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 12 సబ్సిడీ పైన అందిస్తోంది. ఏడాదిలో 12 కంటే ఎక్కువ దాటితే సబ్సిడీ వర్తించదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్, నేచరల్ గ్యాస్ ధరలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజా పెరుగుదలతో హైదరాబాద్‌లో రూ.846.50గా ఉంది.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.93, ముంబైలో రూ.97.34, చెన్నైలో రూ.92.90, కోల్‌కతాలో రూ.91.12, హైదరాబాద్‌లో రూ.95.54, బెంగళూరులో రూ.93.98, జైపూర్‌లో రూ.97.47గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.81.32, ముంబైలో రూ.88.44, చెన్నైలో రూ.86.31, కోల్‌కతా రూ.84.20, హైదరాబాద్‌లో రూ.88.69, జైపూర్‌లో రూ.89.82 లక్నోలో రూ.81.70గా ఉంది. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసల చొప్పున పెరిగాయి. నిన్న, నేడు ధరల్లో మార్పులేదు.
More From GoodReturns

మీ రెస్టారెంట్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications