Gas Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా రావడం లేదా? అయితే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల ఎర్ర సముద్రం (Red Sea) వంటి కీలక మార్గాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగింది. దీనివల్ల భారత్ లో ఎల్‌పీజీ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాతే మరో రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ గడువును 25 రోజులకు పెంచారు. అయితే ఆ గడువు దాటాక కూడా రాకపోతే ఏం చేయాలి?
చాలా చోట్ల గ్యాస్ ఏజెన్సీలు స్టాక్ లేదని చెప్పడం లేదా బుకింగ్ (Gas booking) అయినప్పటికీ డెలివరీలో జాప్యం చేయడం వంటి ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై కఠిన హెచ్చరికలు జారీ చేసింది. గ్యాస్ ఇన్‌వాయిస్‌లో లేని అదనపు రుసుములను చెల్లించవద్దని, అలాగే డెలివరీ నిరాకరించినా లేదా అనవసరంగా బుకింగ్ క్యాన్సిల్ చేసినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది.

గ్యాస్ కంపెనీల హెల్ప్‌లైన్ నంబర్లు..
మీరు వాడుతున్న కనెక్షన్‌ను బట్టి కింది నంబర్లకు కాల్ చేయవచ్చు..
1. ఇండియన్ గ్యాస్ (Indane)..
- టోల్ ఫ్రీ నంబర్: 1800-2333-555
- అత్యవసర నంబర్ (గ్యాస్ లీకేజీ): 1906 (24x7 అందుబాటులో ఉంటుంది)
- ఆన్‌లైన్‌లో ఇండియన్ ఆయిల్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
2. భారత్ గ్యాస్ (Bharat Gas)..
- కస్టమర్ కేర్ స్మార్ట్‌లైన్: 1800-22-4344
- ఈ నంబర్ ద్వారానే గ్యాస్ లీకేజీ సమస్యలను కూడా నివేదించవచ్చు.
3. హెచ్‌పీ గ్యాస్ (HP Gas)..
- హెల్ప్‌లైన్ నంబర్: 1800-233-3555
- మీరు హెచ్‌పీ గ్యాస్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
4. ఉజ్వల యోజన లబ్ధిదారులు..
- ఉజ్వల హెల్ప్‌లైన్: 1800-266-6696
సరఫరాలో జాప్యం
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ సరఫరాలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కృత్రిమ కొరతను సృష్టించి, వినియోగదారుల నుండి అదనపు నగదు వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే మీరు గ్యాస్ బుక్ చేసినప్పుడు వచ్చే అధికారిక మెసేజ్‌లను జాగ్రత్తగా గమనించండి. ఇన్‌వాయిస్‌లో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వకండి. ఒకవేళ ఎవరైనా బలవంతం చేస్తే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
వాణిజ్య అవసరాల కోసం కొత్త కమిటీ
గృహ వినియోగదారులకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు , పరిశ్రమల గ్యాస్ అవసరాలను సమీక్షించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చాలా నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల రెస్టారెంట్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. గందరగోళం వల్ల ప్రజలు ఒక్కసారిగా బుకింగ్స్ చేయడానికి ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అనవసరంగా కంగారు పడి గ్యాస్‌ను నిల్వ (Hoarding) చేయవద్దని అధికారులు కోరుతున్నారు. పైన పేర్కొన్న నిబంధనలను పాటిస్తూ, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధికారిక మార్గాల్లో ఫిర్యాదు చేయడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.


Click it and Unblock the Notifications