నాన్ సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు ఈ రోజు (12 ఫిబ్రవరి) నుండి పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత కొద్ది నెలల్లో ఇది ఆరో పెంపు. ఈ పెరిగిన ధరలు ఈ రోజు నుండే అమలులోకి వచ్చాయి.

ముఖ్య నగరాల్లో ధరలు..
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇది ప్రతి రోజు దేశవ్యాప్తంగా 30 లక్షల ఇండేన్ సిలిండర్లను సరఫరా చేస్తుంది. 14.2 కిలో సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ఈ రోజు నుండి రూ.858.5గా ఉంటుంది. జనవరి 1వ తేదీన సిలిండర్ ధర రూ.144.5 పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.149 పెరిగి రూ.896, ముంబైలో రూ.145 పెరిగి రూ.829.5, చెన్నైలో రూ.147 పెరిగి రూ.881గా ఉంది. ఇండేన్ గ్యాస్ 11 కోట్ల మంది గృహాలకు గ్యాస్‌ను డెలివరీ చేస్తోంది.

ప్రతి నెల ధర సమీక్ష
ఢిల్లీలో జనవరి1వ తేదీన రూ.714, కోల్‌కతాలో రూ.747, ముంబైలో రూ.684.5, చెన్నైలో రూ.734గా ఉంది. ఇప్పుడు వివిధ నగరాల్లో రూ.144 నుండి రూ.149 వరకు పెరిగింది. ఫ్యూయల్ రిటైలర్స్ ప్రతి నెల ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తారు.

వీటిపైనే గ్యాస్ ధర ఆధారపడి ఉంటుంది
భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధర ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎల్పీజీ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ రేటు, రెండోది రూపాయితో డాలర్ మారకం విలువ. ఈ రెండింటిపై గ్యాస్ ధర ఆధారపడి ఉంటుంది.

12 సిలిండర్లు సబ్సిడీపై..
ఫ్యూయల్ రిటైలర్స్ ఎల్పీజీ సిలిండర్లను మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. అయితే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తుంది. 2020-21 బడ్జెట్‌లో కేంద్రం గ్యాస్, కిరోసిన్ వంటి వాటి సబ్సిడీ కోసం రూ.40,915.21 కోట్లు కేటాయించింది. కేవలం గ్యాస్ సబ్సిడీ కోసం రూ.37,256.21 కోట్లు కేటాయించింది. రూ.3,659 కోట్లు కిరోసిన్ కోసం కేటాయించింది.
More From GoodReturns

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications