గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, హైదరాబాద్ సహా ఏ నగరంలో ఎంతంటే?
గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట. నెలవారీ సమీక్షలో భాగంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరలను పెద్ద మొత్తంలో తగ్గించాయి. సవరించిన ధరలు మే 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు తగ్గించడం ఇది వరుసగా మూడోసారి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ధరలు తగ్గించడం కస్టమర్లకు కొంతలో కొంత ఊరట.

హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో ధర ఎంతంటే
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ.207 తగ్గి రూ.589.50గా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.336 తగ్గి రూ.988గా ఉంది. న్యూఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.744 నుండి రూ.581.50. ముంబైలో రూ.776.50 నుండి రూ.579, కోల్‌కతాలోరూ.839.50 నుండి రూ. , చెన్నైలో రూ.826 నుండి రూ.569.50కి తగ్గింది.

లాక్ డౌన్ సమయంలో భారీ ఊరట
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా తగ్గిన నేపథ్యంలో 1.5 కోట్ల మంది సబ్సిడీ పొందలేని కస్టమర్లకు లాక్ డౌన్ సమయంలో భారీ ఊరట. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ నేపథ్యంలో సబ్సిడీ ఉన్న వారికి మూడు నెలల పాటు కేంద్రం గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే.

రూపాయి మారకం విలువపై
ఎల్పీజీ గ్యాస్ ధరలు ప్రతి నెల మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు, రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉంటాయి. ప్రతి నెల ఒకటో తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి చమురు కంపెనీలు. ఇందులో భాగంగా ఇప్పుడు సిలిండర్ ధర భారీగా తగ్గింది. ధర రూ.160 నుండి నగరాలను బట్టి ఆ పైన భారీగా తగ్గింది.

మార్చి 15 నుండి పెట్రోల్, డీజిల్ అదే ధరలు
ఇదిలా ఉండగా, మార్చి 15వ తేదీ నుండి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడిపోతున్నాయి. అయితే ఇక్కడ లాక్ డౌన్ ఉండటంతో ప్రస్తుతం ధరలు గత నెల పదిహేను రోజులుగా యథాతథంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications