కరోనా వైరస్ వ్యాప్తీని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో నెలలో రెండుసార్లు ఎల్పీజీ గ్యాస్ సిలిండర ధరలు తగ్గాయి. గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా దెబ్బతో పాటు రష్యా-సౌదీ ధరల పోరు దీనికి కారణం. గత కొద్ది వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి.

రూ.60 నుండి రూ.65 తగ్గుదల
అన్ని పెద్ద నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 నుండి రూ.65 మధ్య తగ్గింది. ఈ ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) ఆయా నగరాల్లోని ధరలను విడుదల చేసింది.

ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ధరలు..
దీంతో 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.61.5 తగ్గి రూ.805.50 నుండి రూ.744కు తగ్గింది. కోల్కతాలో రూ.839.5 నుండి 774.5కు తగ్గింది. చెన్నైలో రూ.826 నుండి రూ.761.5, ముంబైలో రూ.776.5 నుండి రూ.714.5 తగ్గింది. కోల్కతాలో రూ.65 తగ్గగా, చెన్నైలో రూ.64.50, ముంబైలో రూ.62 తగ్గింది. హైదరాబాద్లో రూ.917 నుండి రూ.862కు తగ్గింది.

19 కిలోల సిలిండర్ ధర
19 కిలోల సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.1,348.50 నుండి రూ.1,285.50కు తగ్గింది. కోల్కతాలో రూ.1,234కు, ముంబైలో రూ.1,402కు తగ్గింది. గత రెండు నెలల్లో సిలిండర్ ధరలు తగ్గుతున్నాయి. ప్రతి ఇంటికి సబ్సిడీ మీద ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్లు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications