న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు షాకిచ్చాయి. గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల 1వ తేదీన సమీక్షిస్తాయి. తాజా జూలై 1 సమీక్షలో భాగంగా ఎల్బీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. అయితే ధర స్వల్పంగా రూ.1 నుండి రూ.4.50 వరకు పెరిగింది. ఇది నేటి నుండి అమలులోకి వచ్చింది.

ఢిల్లీలో నాలుగు నెలల్లో ధరలు..
ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్.. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆయిల్‌కు చెందిన నాన్-సబ్సిడీ 14.2 కిలోల ఇండేన్ సిలిండర్ ధర ఢిల్లీ, ముంబైలలో రూ.594కు పెరిగింది. ఢిల్లీలో కేవలం రూ.1, ముంబైలో రూ.3.50 పెరిగింది. గత నెలలో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.11.50 పెరిగింది. అంతకుముందు గత మూడు నెలలుగా గ్యాస్ ధరలు రూ.277 వరకు తగ్గాయి. ఫిబ్రవరిలో రూ.858.50 (ఢిల్లీ) ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.594కు దిగి వచ్చింది. మార్చి నెలలో రూ.805.50కు, ఏప్రిల్ నెలలో రూ.744కు, మే నెలలో రూ.581.50కి దిగి వచ్చింది. కోల్‌కతాలో రూ.4.50, హైదరాబాద్‌లో రూ.4 పెరిగింది.

వివిధ నగరాల్లో తాజా ధరలు
14.2 కిలోల నాన్-సబ్సిడీ ఇండేన్ సిలిండర్ ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి.
ఢిల్లీ- రూ.594
కోల్‌కతా- రూ.620.50
ముంబై- రూ.594
చెన్నై- రూ.610.50
హైదరాబాద్ - రూ.645.50
నిబంధనల ప్రకారం ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీతో అందిస్తారు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేయాలి.

స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
జూన్ 7వ తేదీ నుండి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు పెరగలేదు. నిన్నటి ధరలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్ మూడు రోజులు, డీజిల్ రెండు రోజులు పెరగలేదు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఢిల్లీలో రూ. 80.43, రూ.80.53, కోల్‌కతాలో రూ.82.10, రూ.75.64, ముంబైలో రూ.87.19, రూ.78.83, చెన్నైలో రూ.83.63, రూ.83.63గా ఉంది.
More From GoodReturns

PNGకి మారకపోతే ఇళ్లకు LPG నిలిపివేత..కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

మీ రెస్టారెంట్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి!

పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

Gas Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా రావడం లేదా? అయితే ఇలా కంప్లైంట్ ఇవ్వండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications