మూడో నెల షాక్: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర, రూ.75 పెంపు
పెరుగుతున్న ఫ్యూయల్ ధరల నేపథ్యంలో కామన్‌మ్యాన్‌కు ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. తాజాగా, కేంద్రం నాన్ సబ్సిడి గ్యాస్ ధరను పెంచింది. వరుసగా మూడో నెల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరను పెంచింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ధర 76 ఎక్కువ కానుంది. ఈ ధర ప్రభావం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారిపై కూడా పడుతుంది.

ఏ నగరంలో ఎంత ఉందంటే?
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తాజా ధరల ప్రకారం 14.2 కిలోల నాన్-సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ముంబైలో రూ.651, ఢిల్లీలో రూ.681.50, కోల్‌కతాలో రూ.706, చెన్నైలో రూ.696 అవుతోంది. ఈ కొత్త ధరలు నేటి నుంచి (నవంబర్ 1) అమలులోకి వస్తాయి. ప్రతి నెల మొదటి రోజున ఎల్పీజీ ధరలను సమీక్షిస్తారు.

మూడు నెలలుగా పెరుగుదల
నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర సెప్టెంబర్ నెలలో రూ.15 పెరిగింది. అక్టోబర్ నెలలో రూ.15.50 పెరిగింది. గత రెండు నెలల్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, ఈ నెల మాత్రం భారీగా పెరిగింది. ఏకంగా రూ.76 పెరగడం గమనార్హం.

5 కిలోల చిన్న సిలిండర్ ధర
ధర పెరిగిన నేపథ్యంలో 5 కిలోల చిన్న సిలిండర్స్ ఇప్పుడు రూ.264.50 అవుతోంది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.119 పెరిగింది. దీని ధర ఢిల్లీలో రూ.1,204, కోల్‌కతాలో రూ.1,258, ముంబైలో రూ.1,151.50, చెన్నైలో రూ.1,319గా ఉంది.

12 సబ్సిడీ సిలిండర్లు.. ఎక్కువైతేనే...
జూలై, ఆగస్ట్ నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మొత్తంగా రూ.163 తగ్గింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తుంది. వీటికి అదనంగా సిలిండర్ కావాలంటే మాత్రమే మార్కెట్ ధర చెల్లించాలి. కానీ దాదాపు 99 శాతం కుటుంబాలకు ఈ అవసరం రాదు.


Click it and Unblock the Notifications