eKyc: ఎల్పీజీ గ్యాస్ వాడేవారికి షాక్.. ఆగస్ట్ 16 నుంచి వారి కనెక్షన్లు రద్దు..!
దేశంలో కోట్లలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఉజ్వల పథకంతో పాటు సాధారణ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేస్తున్నాయి.అయితే ఈ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. చాలా మంది ఎల్పీజీ ఈకేవైసీ చేసుకున్నప్పటికీ కొంత మంది చేసుకోలేదు. మీరు ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేసుకోకుంటే.. వెంటనే చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్ట్ 15వ తేదీగా ఉంది. ఆ లోపు ఈకేవైసీ చేసుకోవాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
గృహ వినియోగం కోసం ఎల్‌ల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు పొందిన వినియోగదారులందరూ తప్పుకుండా తమ గ్యాస్ కనెక్షన్ కోసం ఇ-కెవైసి ధృవీకరణ ప్రక్రియన పూర్తి చేయాలి. ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. మీ గ్యాస్ కనెక్షన్ రద్ద అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ కనెక్షన్ రద్దు అయితే మీకు సిలిండర్ బుక్ కాదు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 15లో తప్పుకుండా ఈకేవైసీ చేసుకోవాలని కంపెనీలు చెబుతున్నాయి. ఈకేవైసీ చేసుకోవడం చాలా సులభం.. గ్యాస్ సిలిండర్ డెలివరీకి వచ్చిన బాయ్ వద్ద యాప్ ఉంటుంది. అతని వద్ద ఈకేవైసీ చేసుకోవచ్చు.

లేదా ఆన్ లైన్ లో కూడా గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేసుకోవచ్చు. మీసేవకు వెళ్లి ఈకేవైసీ చేయవచ్చు. లేదంటే.. కంపెనీల వెబ్ సైట్ కు వెళ్లి కూడా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. మీరు హెచ్పీ గ్యాస్ వాడితే హిందస్థాన్ పెట్రోలియం వెబ్ సైట్ కు వెళ్లీ ఈకేవైసీ చేసుకోవచ్చు. మీరు వాడుతున్న గ్యాస్ కంపెనీ వెబ్ సైట్ కు వెల్లి మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. ఫేషియల్ రికగ్నినేషన్ ద్వారా ఈకేవైసీ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లో చేసుకోలేని వారు, కేవైసీ ధృవీకరణ చేయలేని వరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి చేసుకోవచ్చు.
ప్రస్తుతం దేశంలో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీని ప్రతి సిలిండర్‌కు రూ. 300 చొప్పున ఇస్తున్నారు. ఈకేవైసీ చేసుకోకుంటే ఈ సబ్సీడీ కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో రూ.500 సిలిండర్ అందిస్తున్నారు. అటు రేషన్ కార్డు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి ఆగస్ట్ 31 చివరి తేదీగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications