ముంబై: ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు IDFC ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డు మీద నగదు ఉపసంహరణ వడ్డీ రేట్లను 9 శాతం ఇవ్వాలని యోచిస్తోంది. క్రెడిట్ కార్డుల నుండి నగదు ఉపసంహరణపై అధిక వడ్డీలను వసూలు చేసే అంశానికి సంబంధించి దూరంగా ఉండాలని IDFC ఫస్ట్ బ్యాంకు భావిస్తోంది. మంచి క్రెడిట్ రిపోర్ట్ ఉన్న కస్టమర్లకు ఇప్పటి నుండి కార్డు నగదు ఉపసంహరణపై తక్కువ వడ్డీ రేటు చెల్లించే అవకాశం ఉంది.

భిన్నంగా ముందుకు
IDFC ఫస్ట్ బ్యాంకు క్రెడిట్ కార్డు బిజినెస్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కస్టమర్లపై వడ్డీ రేటును తొమ్మిది శాతం కంటే తక్కువ వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఇది కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి, వార్షిక శాత వడ్డీ రేటు మారుతుంది. ఇది 36 శాతం వరకు ఉంటుంది. ఇప్పటికే క్రెడిట్ కార్డు మార్కెట్లో పలు సంస్థలు ఉన్నాయి. IDFC ఫస్ట్ బ్యాంకు ఆలస్యంగా ప్రవేశించింది. దీంతో బిన్నగా ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.

కస్టమర్లకు... ఇతరులకు
కస్టమర్ ప్రొఫైల్‌ను అంచనా వేసేందుకు, స్కోర్ ఆదారంగా వడ్డీ రేట్లను అందించేందుకు బ్యాంకు యాజమాన్యం స్కోరింగ్ విధానం రూపొందించింది. ఈ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది. ఈ బ్యాంకు ప్రారంభంలో తమ కస్టమర్లకు ఈ క్రెడిట్ కార్డ్స్ అందిస్తుంది. వచ్చే రెండు నెలల్లో కస్టమర్ల నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఏప్రిల్ నుండి బ్యాంకేతర కస్టమర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వారికి ఎక్కువ
పలు బ్యాంకులు నగదు ఉపసంహరణపై మొదటి రోజు నుండే వడ్డీ రేట్లు, ఛార్జీలు వసూలు చేస్తాయి. IDFC ఫస్ట్ బ్యాంకు మాత్రం తొలుత రూ.250 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంది. నగదు ఉపసంహరణపై 48 రోజుల వడ్డీ లేని వ్యవధి అందిస్తోంది. తొమ్మిది శాతం వార్షిక వడ్డీ చాలా వరకు IDFC ఫస్ట్ బ్యాంకు ప్రస్తుతం కస్టమర్ కోసం ఉంది. బ్యాంకు కస్టమర్లు కాని వారికి మాత్రం వడ్డీ రేటు కాస్త ఎక్కువ.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications