Mukesh Ambani: ఈ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వారికి నిజంగా పండగ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనతో రాకెట్ వేగంతో స్టాక్ దూసుకుపోతోంది. అవును ఈ క్రమంలో స్టాక్ గడచిన 19 రోజులుగా అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. దీంతో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు కనకవర్షం కురుస్తోంది.

అంబానీ నిర్ణయం..
ఇటీవలి కాలంలో రిలయన్స్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార విస్తరణపై గతంలో ఎన్నడూ లేనంత దృష్టిని సారించింది. అలా కొత్తగా అనేక కంపెనీలను కొనుగోలు చేస్తూ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ముందుకు సాగుతోంది. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండి అంబానీ కుమార్తె ఇషాదేనని తెలుస్తోంది. కేవలం ఒక్క ప్రకటనతో కంపెనీలోని ఇన్వెస్టర్ల తలరాత నిజంగా మారిపోయిందని చెప్పుకోవాలి.

స్టాక్ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది లోటస్ చాక్లెట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ గురించే. ఈ చాక్లెట్ కంపెనీలో వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ ప్రకటించినప్పుడు కంపెనీ స్టాక్ ధర రూ.96 వద్ద ఉంది. అయితే అప్పటి నుంచి గత 19 రోజులుగా స్టాక్ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి రూ.242.90 ధరకు చేరుకుంది.

రిలయన్స్ ఓపెన్ ఆఫర్..
రిలయన్స్ గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ లోటస్ చాక్లెట్‌లో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాయి. ఈ ఓపెన్ ఆఫర్ ఫిబ్రవరి 21, 2023న మెుదలై మార్చి 6, 2023న ముగుస్తుంది. ఈ ఓపెన్ ఆఫర్లో కంపెనీ స్టాక్ ధరను రూ.115.50గా నిర్ణయించింది. రెండు కంపెనీలు సంయుక్తంగా లోటస్ చాక్లెట్‌లో 33.38 శాతం వాటాను కొనుగోలు చేయనున్నాయి.

కంపెనీ లాభాలు..
టాక్లెట్ల తయారీ విక్రయంలో ఉన్న కంపెనీకి ఈ డీల్ చాలా కీలకమైనదిగా తెలుస్తోంది. దీంతో కంపెనీ అమ్మకాలు సైతం భారీగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండవ త్రైమాసికంలో లోటస్ చాక్లెట్ కంపెనీ రూ.14.63 కోట్ల నికర అమ్మకాలపై రూ.49 లక్షల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు రూ.20.95 కోట్లు కాగా రూ.1.52 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 1988లో స్థాపించబడిన లోటస్ కంపెనీ కోకో, చాక్లెట్ ఉత్పత్తుల వ్యాపారంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications