కోవిడ్ మహమ్మారి ముగిసినట్టు మీరు అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. దాని ప్రభావాలు ఇంకా చాలామందిని వెంటాడుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయినవారు ఇప్పటికీ సరైన స్థిరత్వాన్ని పొందలేక ఆర్థిక పరిస్థితులు సహకరించక గిలగిల కొట్టుకుంటున్నారు. నేటికీ చాలామంది కరోనా మిగిల్చిన ఆర్థిక నష్టాల నుంచి పూర్తిగా కోలుకోలేక పోతున్నారు. ఇదంతా ఒకపక్క అంశం అయితేమరో వైపు ఆరోగ్యపరమైన పరిమాణాలు మాత్రం ఇంకా నిరంతరం అందర్నీ వెంటాడుతున్నాయి.
కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో లక్షల మందికి ఉద్యోగాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌లు, ఫ్యాక్టరీల మూసివేత, చిన్న వ్యాపారాల మూతపడటం వంటి కారణాల వల్ల ప్రధానంగా సేవా రంగం, రియల్ ఎస్టేట్, గెస్ట్‌హౌస్/హోటల్ రంగం, ట్రాన్స్‌పోర్ట్, రిటైలింగ్ వగైరాల్లో భారీగా ఉద్యోగాలు తొలగించబడ్డాయి.
మొదటి లాక్‌డౌన్ కాలంలోనే దాదాపు 1.8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా కాంట్రాక్ట్, నాన్-పర్మనెంట్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఆ తర్వాతి ఆర్ధిక సంవత్సరం వరకు కూడా అత్యంత ప్రభావిత వర్గాల్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు తిరిగి రాలేదు. కరోనా వల్ల వచ్చిన ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ పలు రంగాలలో "స్లో రికవరీ" దశలో ఉంది. కాంట్రాక్ట్ వర్కర్లు, మహిళలు, యువ యువత ఎక్కువగా నష్టపోయిన వర్గాలుగా గుర్తించబడ్డారు.

ఈ పరిస్థితుల మధ్య తాజా అధ్యయనాలు ఒక ఆందోళన కలిగించే విషయాన్ని బయటపెట్టాయి. COVID కి గురైన వ్యక్తులలో, ప్రత్యేకంగా మహిళల్లో, రక్తసంచారణ వ్యవస్థ త్వరగా వృద్ధాప్యం వైపు దూసుకుపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మన ధమనులు కొంచెం గట్టిపడతాయి. కానీ కరోనా బారినపడ్డ వారిలో ఈ ప్రక్రియ సుమారు ఐదు సంవత్సరాల వరకు వేగంగా జరుగుతున్నట్టు తాజాగా యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.
మహమ్మారి శ్వాసకోశ వ్యవస్థను మాత్రమే ప్రభావితం చేస్తుందని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావించారు. తాజాగా విడుదలైన ఒక అధ్యయనం ఈ మహమ్మారి.. రక్తనాళాలను కూడా వేగంగా వృద్ధాప్య దశకు తీసుకెళ్తోందని గుర్తించారు. ఫ్రాన్స్‌లోని పారిస్ సిటీ యూనివర్శిటీ ప్రొఫెసర్ రోసా మరియా బ్రూనో నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోవిడ్ బారిన పడిన మహిళల్లో రక్తనాళాల వృద్ధాప్యం సాధారణంగా జరిగే ప్రక్రియ కంటే సుమారు ఐదు సంవత్సరాలు వేగంగా జరుగుతోందని తేలింది. ఆసక్తికరమేంటంటే తేలికపాటి కేసులు అయిన పురుషులు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాలు కొంచెం గట్టిపడతాయి. దానిని నిపుణులు వాస్కులర్ ఎేజింగ్" (Vascular Ageing) అంటారు. అయితే కరోనా వైరస్ శరీరంలోని రక్తనాళాల పైపు ప్లేట్ మీద ఉండే ACE2 రిసెప్టర్‌లపై ప్రత్యక్షంగా దాడి చేస్తుందని గతంలోనే గుర్తించారు. అయితే కొత్త అధ్యయనం ప్రకారం.. ఈ దాడి ఫలితంగానే రక్తనాళాలు అకాల వృద్ధాప్యం దశకు వెళ్తున్నాయి.
అలా గట్టిపడిన ధమనులు హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వస్తే తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయని గుర్తించారు.
సెప్టెంబర్ 2020 నుండి ఫిబ్రవరి 2022 వరకు ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, సహా 16 దేశాల నుంచి 2,390 మంది మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వారిని సైంటిస్టులు నాలుగు గ్రూపులుగా వర్గీకరించారు. ఎప్పుడూ కోవిడ్ రాని వారు, తేలికపాటి కోవిడ్ వచ్చిన వాళ్లు, సాధారణ వార్డులో చేరిన తీవ్రత కలిగి ఉన్న వారు, ఐసీయూ చికిత్స పొందిన వారు ఇలా నాలుగు రకాలుగా విభజించారు. ఆ తరువాత వీరి రక్తనాళాల దృఢత్వాన్ని (Pulse Wave Velocity) 6 నెలలు, 12 నెలల తర్వాతను పెద్దసంఖ్యలో కొలిచారు.
ఎలాంటి ఫలితాలు వచ్చాయి? : కరోనా వచ్చిన వారిలో సగటు ధమనుల గట్టిపడటం 0.5 m/s పైగా ఉంది. ఇది ఒక మహిళలో ఐదు సంవత్సరాల వయస్సు పెరుగుదలకి సమానం. ఇక వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఈ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అలాగే దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు (అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది.
శాస్త్రవేత్తల ప్రకారం.. మహిళలలో రోగనిరోధక ప్రతిస్పందన ఎక్కువగా ఉండటం వల్ల, వారి రక్తనాళాలపై ఎక్కువ ఒత్తిడి పడుతోంది. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువని తేలింది. ఎవరికైనా సాధారణంగా అనిపించే అలసట లేదా శ్వాసలో తేలికపాటి ఇబ్బందులు కనబడితే... అవి చేదు అనుభవాన్ని గుర్తు చేసే కొత్త హెచ్చరికలు కావచ్చని గుర్తించుకోండి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications