మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం బిర్యానీకో, సాఫ్ట్‌వేర్ కంపెనీలకో మాత్రమే కాదు.. గ్లోబల్ 'బ్యూటీ టెక్' కు కూడా అడ్రస్‌గా మారబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ దిగ్గజం 'లారియల్' (L'Oréal) తన మొట్టమొదటి గ్లోబల్ టెక్ హబ్‌ను మన భాగ్యనగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026 సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఈ కీలక ఒప్పందం కుదిరింది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏమిటీ ఈ 'బ్యూటీ టెక్' హబ్?
లారియల్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆఫీసులు ఉన్నా.. కేవలం టెక్నాలజీ కోసమే అంకితమైన మొట్టమొదటి హబ్‌ను మన హైదరాబాద్ (Hyderabad) లో ఏర్పాటు చేయాలని చూస్తోంది. అయితే ఇది మామూలు టెక్నాలజీ సెంటర్ కాదు! ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ AI, ఏజెంటిక్ AI, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో బ్యూటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. అంటే, భవిష్యత్తులో మనకు నచ్చే మేకప్ ప్రొడక్ట్స్ లేదా స్కిన్ కేర్ చిట్కాలను AI ఎలా డిజైన్ చేయాలో ఇక్కడి నుండే ప్లాన్ చేస్తారన్నమాట!
రూ. 3,500 కోట్ల పెట్టుబడి.. 2,000 ఉద్యోగాలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, లారియల్ సంస్థ 2030 నాటికి సుమారు రూ. 3,500 కోట్లు (350 మిలియన్ యూరోలు) పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల దాదాపు 2,000 మంది టెక్ నిపుణులకు ఉపాధి లభించనుంది. ముఖ్యంగా AI స్పెషలిస్టులు, ఇంజనీర్లు, డేటా ప్రొఫెషనల్స్‌కు ఇది ఒక గొప్ప అవకాశం. "తెలంగాణ రైజింగ్: 2047 విజన్"లో భాగంగా మన రాష్ట్రాన్ని గ్లోబల్ AI క్యాపిటల్ గా మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
భారత్-ఫ్రాన్స్ మైత్రికి నిదర్శనం
2026 సంవత్సరాన్ని 'భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్' గా జరుపుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ రావడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. లారియల్ CEO నికోలస్ హిరోనిమస్ మాట్లాడుతూ.. "గత 31 ఏళ్లుగా మేము భారత్ తో అనుబంధం కలిగి ఉన్నాము. ఇప్పుడు ఇక్కడి టాలెంట్ ను ఉపయోగించి ప్రపంచ స్థాయి టెక్నాలజీని రూపొందించాలని నిశ్చయించుకున్నాం" అని తెలిపారు.
హైదరాబాద్ ఎందుకంత స్పెషల్?
ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలకు అడ్డాగా మారిన హైదరాబాద్ (Hyderabad), ఇప్పుడు లారియల్ రాకతో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకుంది. ఫ్రాన్స్, అమెరికా, చైనా వంటి దేశాల సరసన ఇప్పుడు హైదరాబాద్ పేరు కూడా చేరిపోయింది. తెలంగాణ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన 'తెలంగాణ AI హబ్' కు ఈ లారియల్ టెక్ సెంటర్ ఒక బూస్ట్‌లా పనిచేయనుంది.
అందం, విజ్ఞానం (Beauty & Science) కలిస్తే అద్భుతాలు జరుగుతాయని లారియల్ నమ్ముతోంది. ఆ అద్భుతాలకు మన హైదరాబాద్ (Hyderabad) వేదిక కావడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. కేవలం ఉద్యోగాలే కాకుండా, లోకల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లడం ఖాయం!
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications