పండగల సీజన్: బంఫర్ ఆఫర్, ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్లు.. తక్కువ వడ్డీకే, వివరాలివే..
పండగలు వస్తున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా బ్యాంకులు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే హోం లోన్స్ వడ్డీ కూడా భారీగా తగ్గిస్తున్నాయి. దీంతో గృహలు నిర్మించే వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుంది.. నెల నెలకు ఈఎంఐ ఎంత ఉందో తెలుసుకుందాం పదండీ.

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా..
ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలసిందే. హోం లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్లు ఇచ్చాయి. అయితే పండగల సందర్భంగా ప్రైవేట్ బ్యాంకులు ఆఫర్లు ఇస్తోన్న సంగతి తెలిసిందే. వాటికి ధీటుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణం అందజేస్తున్నాయి. మరోవైపు ఆర్బీఐ కూడా రెపో రేటు తగ్గించింది. 2019 నుంచి 2020 ప్రారంభంలో కూడా కొనసాగింది.

రూ.75 లక్షల వరకు రుణం..
దీంతో వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులు హోం లోన్స్ భారీగా తగ్గించాయి. రూ.75 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ తగ్గించి.. ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం, కెనరా బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 6.90. యూనియన్ బ్యాంక్ 6.95, బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.05 శాతం, కోటక్ బ్యాంక్ 7.10 శాతం, ఐవోబీ, యూకో బ్యాంక్ 7.15 శాతం వడ్డీ కింద ఇస్తున్నాయి.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా
ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణాలను తక్కువకే ఇస్తున్నాయి. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ 7శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 7.50, కాన్ పిన్ హోమ్స్ 7.95, అవాస్ ఫైనాన్షియర్ 8, రెప్కో హోమ్ 8.25, టాటా క్యాపిటల్ 8.50, పీఎన్‌బీ 8.60, దీవాన్ హౌసింగ్ 8.75, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫిన్ 8.99 శాతం చొప్పున ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications