బెంగళూరులో ఇల్లు అద్దెకు కావాలా? అయితే హాట్ స్పాట్ ఏరియాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూడండి!

మీరు ఉద్యోగం కోసమో లేదా బిజినెస్ కోసమో సిలికాన్ వ్యాలీ బెంగళూరు (Bengaluru) లో ఇల్లు వెతుకుతున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. ప్రస్తుతం బెంగళూరులో ఇళ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. మ్యాజిక్ బ్రిక్స్ తాజాగా విడుదల చేసిన 'రెంటల్ ఇండెక్స్ క్వార్టర్లీ రిపోర్ట్' ప్రకారం.. దేశంలోనే మోస్ట్ యాక్టివ్ రెంటల్ మార్కెట్‌గా బెంగళూరు నిలిచింది. ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఫుల్ స్వింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, స్టూడెంట్స్ రాక విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది.

Looking for a rental home in Bengaluru Check demand rents and emerging hotspots

ఏ ఏరియాల్లో ఫుల్ డిమాండ్ ఉందంటే?

బెంగళూరులో ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండే ఏరియాలకే ఎప్పుడూ క్రేజ్ ఎక్కువ. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్ (Whitefield), సర్జాపూర్ రోడ్ (Sarjapur Road), , మరతహళ్లి (Marathahalli) ఏరియాల్లో అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మెట్రో కనెక్టివిటీ పెరగడం, రాబోయే పెరిఫెరల్ రింగ్ రోడ్, కొత్త టెక్ పార్కుల ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతాల్లో రెంట్లు బాగా పెరిగాయి. అలాగే కొత్తగా కనకపుర రోడ్, థానిసాంద్ర లాంటి ఔటర్ ఏరియాల్లో కూడా ఇళ్ల సప్లై, డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

ఎలాంటి ఇళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు?

ఈ రిపోర్ట్ ప్రకారం బెంగళూరులో జనాలు మీడియం సైజ్ ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

  • 1,000 నుండి 1,500 చదరపు అడుగుల (sq ft) విస్తీర్ణం ఉన్న ఇళ్లకు 41% డిమాండ్ ఉంది.
  • 500 నుండి 1,000 చదరపు అడుగుల ఇళ్లకు 34% డిమాండ్ ఉంది.
  • కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 2BHK, 3BHK ఫ్లాట్లకు ఏకంగా 72% మంది ఓటేశారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బెంగళూరులో 73% మంది 'సెమీ-ఫర్నిష్డ్' (Semi-furnished) ఇళ్లనే కోరుకుంటున్నారు. మార్కెట్లో కూడా ఇలాంటి ఇళ్లే 74% వరకు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఫర్నిష్డ్ లేదా ఖాళీగా ఉండే అన్‌ఫర్నిష్డ్ ఇళ్లకు డిమాండ్ కాస్త తక్కువగానే ఉంది.

అద్దెలు ఎంత పెరిగాయంటే?

ఇక అసలు విషయానికి వస్తే.. రెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏకంగా 16.4% పెరిగాయి. కేవలం ఈ ఒక్క త్రైమాసికంలోనే రెంట్లు దాదాపు 10% జంప్ అయ్యాయి. ప్రస్తుతం బెంగళూరులోని ప్రముఖ రెసిడెన్షియల్ ఏరియాల్లో ఒక సాధారణ 2BHK అపార్ట్‌మెంట్ నెలవారీ అద్దె రూ. 41,000 నుండి రూ. 70,000 వరకు పలుకుతోంది. మార్కెట్లో ఉన్న మొత్తం డిమాండ్‌లో సగానికి పైగా ఇళ్లు రూ. 50,000 లోపు బడ్జెట్ ఉన్నవే కావడం గమనార్హం.

కొత్త ఏరియాల్లో ఇళ్లు పెరుగుతున్నాయి!

కోర్ సిటీ (మెయిన్ ఏరియాలు) లో ఇళ్లు దొరకడం కష్టంగా మారడంతో, సిటీ శివార్లలో ఇళ్ల సప్లై 15% పెరిగింది. ముఖ్యంగా సర్జాపూర్ రోడ్‌లో అత్యధికంగా 18% కొత్త అద్దె ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ ఉండటంతో ఐటీ ఉద్యోగులు ఇప్పుడు సిటీ లోపల కాకుండా ఈ కొత్త కారిడార్ల వైపు చూస్తున్నారు. కాబట్టి మీరు బెంగళూరులో ఇల్లు చూస్తుంటే.. ఆఫీస్ కనెక్టివిటీ, బడ్జెట్ చూసుకుని ఈ కొత్త ఏరియాలను కూడా ఆప్షన్‌గా పెట్టుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+