కంపెనీల పరపతి రేటింగ్ కోసం, రేటింగ్ సంస్థలు అనుసరించే పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దక్షిణ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి (ఎస్‌ఐసీసీఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు.
ఒక కంపెనీ రుణ పత్రాలు, ఆస్తుల పరపతి రేటింగ్‌ను రేటింగ్ సంస్థలు ఎలా నిర్ణయిస్తాయి? ఆ విధానాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే అంశంపై తాను ఇప్పటికే కొన్ని రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమై చర్చించినట్టు ఆమె తెలిపారు.
రేటింగ్ ఏజెన్సీల నుంచి అత్యంత భద్రతను సూచించే ట్రిపుల్ ఏ రేటింగ్ పొందిన కొన్ని కంపెనీలూ, ఇటీవల కుప్పకూలిన విషయాన్ని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. ఈ సంఘటనలతోనే బ్యాంకుల ఆస్తుల నాణ్యత, కంపెనీల రుణ పత్రాలు, ఆస్తుల పరపతి రేటింగ్స్‌పై మదింపు జరుగుతోందన్నారు.

అలాగే ఆర్థిక అవకతవకలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లకు మరిన్ని అధికారాలు ఇచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సీతారామన్ వెల్లడించారు. కష్టాల్లో ఉన్న రంగాల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
కొత్త ప్రమోటర్లకు రక్షణ కోసం...
మరోవైపు కొత్త ప్రమోటర్లకు రక్షణ కల్పించడం కోసం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)-2016లో కీలక సవరణలు చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు సిద్ధమైంది. దీనికోసం పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు చెప్పాయి.
ఏవైనా కంపెనీలు దివాలా తీసినప్పుడు వాటికి సంబంధించిన ఆస్తులను దివాలా ప్రక్రియ కింద ఇతర ప్రమోటర్లు కొన్నప్పుడు.. పాత కేసుల నుంచి కొత్త ప్రమోటర్లకు రక్షణ కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే, ఇటీవల దివాలా ప్రక్రియలో భాగంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ.. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) ఆస్తులను కొనుగోలు చేసింది.
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇటీవల భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు చెందిన రూ.4 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. పాత ప్రమోటర్లపై అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకున్నట్టు ఈడీ అధికారులు ప్రకటించారు.
ఇలా గనుక జరిగితే భవిష్యత్తులో దివాలా తీసిన సంస్థల ఆస్తులు కొనుగోలుకు ఇతర ప్రమోటర్లు ఎవరూ ముందుకురారని, పాత ప్రమోటర్లపై ఉన్న పాత కేసులు, కొత్త ప్రమోటర్లకు వర్తించకుండా ఉండేలా ఐబీసీ చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications