మీ భార్యను ఎంతసేపు చూస్తారు ?.. 70 కాదు 90 గంటలు.. బడా ఛైర్మన్ రియాక్షన్..
వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి సూచించడంతో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చ మొదలైంది. తాజా ఇప్పుడు దీనికి సంబంధించి మరో బడా కంపెనీ చైర్మన్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. అవును, మీరు విన్నది నిజమే.. L&T చైర్మన్ తన ఉద్యోగులతో మాట్లాడుతూ వారానికి 90 గంటలు పని చేయాలని సూచించారు. ఇది మాత్రమే కాదు, L&T ఛైర్మన్ SN సుబ్రమణియన్ కూడా మీరు ఇంట్లో ఉండి మీ భార్యను ఎంతకాలం చూస్తారు?' అంటూ చెప్పుకొచ్చారు.
లార్సెన్ & టూబ్రో (L&T) ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ఉద్యోగులతో మాట్లాడుతు 'ఆదివారం' రోజున కూడా నేను వర్క్ చేస్తానన్నారు. వారానికి 90 గంటలు పనిచేయాలని సమర్ధిస్తూ.. తానే స్వయంగా ఆదివారం ఆఫీసుకి వస్తానని, వీలైతే ఆదివారం కూడా ఉద్యోగులను పని చేసేలా చూస్తానన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుబ్రమణియన్ ఈ ప్రకటన వారానికి ఆరు రోజుల పని విధానం గురించి తన కంపెనీలో చర్చిస్తున్న సమయంలో వచ్చింది.

ఎల్ అండ్ టీ చైర్మన్ ఏమన్నారు?
రెడ్డిట్‌లో ప్రసారమైన ఒక వీడియోలో ఎల్‌అండ్‌టి చైర్మన్ వారానికి 90 గంటలు పని చేయమని సలహా ఇవ్వడమే కాకుండా, 'మీరు ఇంట్లో కూర్చొని ఎం చేస్తారు, ఎంతసేపు మీ భార్యను చూస్తారు, ఎంతపు ఒక భార్య తన భర్తని చూస్తుంది, ఇంట్లో కంటే ఆఫీసు వచ్చి వర్క్ చేయండి, నేను ఆదివారం మిమ్మల్ని పని చేయించలేకపోయినందుకు చింతిస్తున్నాను, నేను మిమ్మల్ని అలా చేయగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను, ఎందుకంటే నేనే కూడా ఆదివారం పని చేస్తాను కాబట్టి' అంటూ ఉద్యోగులతో వీడియో ద్వారా ఉన్నారు.
90 గంటల పని
వారానికి పని గంటలు సూచిస్తూ L&T ఛైర్మన్ ఒక చైనీస్ వ్యక్తితో తన సంభాషణను ఉదాహరణగా కూడా ఇచ్చారు. చైనా కార్మికులు వారానికి 90 గంటలు పని చేస్తుంటే అమెరికా వారానికి 50 గంటల పని చేస్తునందున చైనా అమెరికాను అధిగమించగలదని ఆ వ్యక్తి పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఈ ఉదాహరణను ఇస్తూ అతను తన ఉద్యోగులను సమాధానం చెప్పమని కోరారు, మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే మీరు వారానికి 90 గంటలు పని చేయాలి ముందుకు సాగండి అంటూ చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో కూడా విమర్శలకు గురవుతోందని, గత ఏడాది చర్చనీయాంశమైన ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి 70 గంటల పని గురించి చేసిన ప్రకటనతో సుబ్రమణ్యన్ చేసిన ఈ ప్రకటనను పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications