Nishcha Shah: నేటి యువటి ఉద్యోగంలో లక్షల్లో సంపాదిస్తున్నప్పటికీ తృప్తి చెందటం లేదు. తమకు నచ్చిన పనిచేసేందుకు పెద్ద జాబ్స్ సైతం విడిచిపెడుతున్నారు. నచ్చినపని చేస్తూ సక్సెస్ సాధించాలనే ఫార్ములాను అమలు చేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నిశ్చా షా అనే యువతి సక్సెస్ స్టోరీ గురించే. వాస్తవానికి ఏడాది కిందటి వరకు ఆమె లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో దాదాపు 10 ఏళ్లు పనిచేసిన నిశ్చ తన ఉద్యోగాన్ని వదిలి యూట్యూబ్ అకౌంట్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కంటెంట్ క్రియేటర్ గా మారిన ఆమె ప్రస్తుతం గతంలో తన నెలవారీ జీతం కంటే నాలుగు రెట్లు అధికంగా సంపాదిస్తోంది.

2022లో నిశ్చ లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తున్నారు. అప్పట్లో ఆమె వార్షిక ప్యాకేజీ 2.56 లక్షల డాలర్లుగా ఉంది. 9 ఏళ్ల పాటు ఒకే రకమైన పని చేసిన నిశ్చ ఏదన్నా కొత్తగా చేయాలనే ఆలోచనలో పడ్డారు. అలా తనకున్న పరిజ్ఞానంతో ఇతరులకు పెట్టుబడి పెట్టడంలో సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అలా 2023లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్తి సమయం యూట్యూబర్‌గా మారారు. అలా పర్సనల్ ఫైనాన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఛానెల్‌ని రూపొందించింది. ఆమె ఆలోచన సక్సెస్ అయ్యింది అలా మే 2023 నుంచి మే 2024 మధ్య కాలంలో యూట్యూబ్ నుంచి ఏకంగా రూ.8 కోట్ల ఆదాయాన్ని నిశ్చ పొందారు.
తాను గతంలో కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందటంతో పాటు.. ఇదే సమయంలో నేను ప్రజలకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. నేను ఏది మంచిదో అదే చేస్తాను. ప్రజలకు సహాయం చేయడం కంటే గొప్పది మరొకటి లేదని నిశ్చ అభిప్రాయపడ్డారు. అయితే తాను ఉద్యోగాన్ని మానేసే ముందు 9 నెలలకు సరిపడా మెుత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు. తాను అకస్మాత్తుగా ఈ చర్య తీసుకోలేదని, పూర్తి సన్నాహాలు చేశానని షా చెప్పారు. ఎందుకంటే ఎక్కువ దూరం నడవాలంటే చాలా ప్రిపరేషన్‌తో వెళ్లాలని తనకు తెలుసని పేర్కొన్నారు.
షా యూట్యూబ్‌లో 1000 మంది సబ్‌స్క్రైబర్‌లను చేరుకోవడానికి 11 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే సెప్టెంబర్ 2022లో అతని జీవితంపై ఒక వీడియో వైరల్ కావడంతో ఆమె అదృష్టం మారిపోయింది. దాని కారణంగా 50 వేల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందారు. నిశ్చ ప్రస్తుతం ప్రధానంగా "మిమ్మల్ని పేదలుగా మార్చే డబ్బు అలవాట్లు"లో పెట్టుబడి పెట్టడంపై వీడియోలు చేస్తున్నారు. సామాన్యులు తమ మెుదటి వెయ్యిని ఎలా పెట్టుబడి పెట్టాలనే అంశంపై వీడియో చేశారు. ఆమె విశ్వసనీయమైన వ్యక్తిగత ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా.


Click it and Unblock the Notifications