ఏదైనా బ్యాంక్ అకౌంట్ తీసుకునే సమయంలో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అయితే ఈ ఫార్మాలిటీస్లో నామినిని పెట్టుకోవడం కూడా ఉంటుంది. అయితే నామినికి సంబంధించి ఒక నియమం ఉండేది అదేంటంటే ఎవరైనా ఒకరిని నామినిగా పెట్టుకొవచ్చు. కానీ కరోనా లాక్ డౌన్ సమయంలో బ్యాంక్ కస్టమర్లకి ఎదురైనా సమస్యల దృశ్య బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభ తాజాగా ఆమోదించింది. దీంతో బ్యాంకింగ్ నిబంధనలలో పెను మార్పులు రానున్నాయి. అలాగే కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభం కానుంది.
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లులో అతిపెద్ద మార్పు ఏమిటంటే ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కోసం నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు ఒకరిని మాత్రమే నామినీగా పెట్టుకునే నిబంధన ఉండేది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏదైనా బ్యాంక్ కస్టమర్ మరణించిన తర్వాత అతని అకౌంట్లో ఉన్న డబ్బు నామినికి అందించడంలో ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఈ మార్పు చేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్ కుటుంబం లేదా నామిని సులభంగా డబ్బు పొందవచ్చు. అంతేకాకుండా లీగల్ ప్రాసెస్లో జాప్యం కూడా తగ్గుతుంది.

మంగళవారం లోక్‌సభలో ఆమోదించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024లో బ్యాంకు కస్టమర్లు అకౌంట్ పై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే నామినీలను పెట్టుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి నామినీలందరికీ కలిపి ఫిక్స్డ్ వాటా ఇవ్వడం. రెండవది నామినీలను ఒక అల్టర్నేటివ్లో పెట్టుకోవడం ఇలా ఒకరి కాకపోయినా మరొకరు డబ్బు అందుకుంటారు. మీరు ఏ అప్షన్ సేలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టంపై ఆధార పడి ఉంటుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు పార్లమెంట్ లోక్ సభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో సీతారామన్ మాట్లాడుతూ డిపాజిటర్లకు సీక్వెన్షియల్ లేదా వన్-టైమ్ నామినేషన్ సౌకర్యం ఉంటుందని చెప్పారు. లాకర్ సదుపాయాన్ని పొందుతున్న కస్టమర్‌లు సీక్వెన్షియల్ నామినేషన్ మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. 2014 నుంచి బ్యాంకులను స్థిరంగా ఉంచడంలో ప్రభుత్వం ఇంకా ఆర్‌బిఐ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. మా బ్యాంకులను సురక్షితంగా, స్థిరంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచడమే మా లక్ష్యం అలాగే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు ఫలితాలను చూస్తున్నారు' అని అన్నారు.
సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల (చైర్మెన్ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ మినహా) పదవీకాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది. రాజ్యాంగం (97వ సవరణ) చట్టం 2011కి అనుగుణంగా ఈ సవరణ చేసింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో నియమించడానికి అనుమతి లభిస్తుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications