Delhivery Earnings: దేశంలో కొన్నాళ్లుగా స్టార్టప్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకపక్క కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను నిలుపుకోవటానికి అవసరమైన నిధులు లేక ఆందోళన చెందుతుంటే మరికొన్ని మాత్రం లాభాల్లోకి ప్రవేశిస్తూ పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతునున్నది లాజిస్టిక్స్ వ్యాపారంలో స్టార్టప్ కంపెనీగా ఉన్న దిల్లీవెరీ నిలిచింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఇటీవల ప్రకటించగా తొలిసారిగా రూ.11.7 కోట్ల నికర లాభాన్ని సాధించినట్లు కంపెనీ నివేదించింది. ఈ కాలంలో కంపెనీ ఏకీకృత నికర ఆదాయం రూ.2,194 కోట్లకు చేరుకుంది. ఇది గత త్రైమాసికంలో నమోదైన ఆదాయం రూ.1,941 కోట్ల కంటే 13 శాతం అధికం. అలాగే ఏడాది కిందట ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.1,823 కోట్లుగా నిలిచింది.

యునికార్న్ లాజిస్టిక్స్ సంస్థ FY24 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దాని నికర నష్టాన్ని రూ.103 కోట్లగా నివేదించిన సంగతి తెలిసిందే. అలాగే Q3 FY23లో దాని నికర ఏకీకృత నష్టం రూ.195.6 కోట్లుగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ EBITDA రూ.183 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. కంపెనీ పీక్ డిమాండ్ ఉన్న సమయంలో కూడా నెట్‌వర్క్ నాణ్యత పటిష్టంగా కొనసాగించగలిగిందని కంపెనీ MD & సీఈవో సాహిల్ బారువా అన్నారు. కంపెనీ నిరంతరం మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా మెరుగైన పనితీరును కనబరుస్తూ లాభదాయకతను సాధించింది.
అయితే శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే.. ఎన్ఎస్ఈలో స్వల్పంగా నష్టాలతో స్టాక్ ధర రూ.465 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలో ఇంట్రాడేలో స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.477.80ను చేరుకుంది. అయితే సోమవారం షేర్లలో లాభదాయకతపై సానుకూల ట్రేడింగ్ కొనసాగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications