కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో లిక్కర్ సేల్స్ భారీగా పడిపోయాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ పైన భారీగా ట్యాక్స్ పెరగడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపింది. కరోనా లాక్ డౌన్, భారీగా పెరిగిన పన్నులు/ధరల వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో లిక్కర్ సేల్స్ ఏకంగా 29 శాతం క్షీణించినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అల్కాహాలిక్ బీవరేజ్ కంపెనీస్ (CIABC) నివేదిక వెల్లడిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సహా ఈ రాష్ట్రాల్లో డౌన్
ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చాక ధరలను భారీగా పెంచారు. దీంతో సేల్స్ పడిపోయాయి. కరోనా కేసులు, అధిక ట్యాక్సుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సేల్స్ పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఐఎంఎఫ్ఎల్(ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్) సేల్స్ మొదటి అర్ధ సంవత్సరంలో 29 శాతం పడిపోయినట్లు CIABC తెలిపింది.

పన్నులు పెంచితే ఆదాయం పెరగదు..!
మద్యం పైన అధిక పన్నులు వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని భావిస్తే అది తప్పు అవుతుందని CIABC డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి అన్నారు. మద్యం ధరలపై 5 శాతం నుండి 10 శాతం వరకు పెంచితే ఆయా రాష్ట్రాల్లో విక్రయాలు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని, పన్నులు పెంచితే ఆదాయం పెరుగుతుందని భావిస్తే అది పొరపాటు అన్నారు. ఏప్రిల్-జూన్ మొదటి క్వార్టర్‌లో సేల్స్ 49 శాతం క్షీణిస్తే, రెండో త్రైమాసికంలో 9 శాతం మేర పడిపోయాయి. మే నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో సేల్స్ 16 శాతం క్షీణించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై ఆదాయం సగానికి పైగా డౌన్
అధిక పన్నులు విధించిన రాష్ట్రాల్లో సేల్స్ అంతేస్థాయిలో క్షీణించాయని CIABC తెలిపింది. పన్ను పెరిగిన క్రమంలోనే.. అదే విధంగా సేల్స్ కూడా తగ్గాయని పేర్కొంది. ఎక్కువ పన్ను విధించిన ప్రాంతాల్లో సేల్స్ ఎక్కవగా తగ్గడం, తక్కువ పన్ను విధించిన రాష్ట్రాల్లో కాస్త తక్కువగా కనిపించాయి. రెండో త్రైమాసికంలో పన్నులు అధికంగా పెంచిన రాష్ట్రాల్లో సేల్స్ కూడా అధికంగానే తగ్గాయని తెలిపింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో 51 శాతం క్షీణించాయి. ఆ తర్వాత చత్తీస్‌గఢ్ 40 శాతం, జమ్ము కాశ్మీర్ 39 శాతం, పశ్చిమ బెంగాల్ 22 శాతం, రాజస్తాన్ 20 శాతం ఉన్నాయి. పన్నులు ఎంతగా పెరిగితే అంత సేల్స్ తగ్గడంతో పాటు, కస్టమర్లు కూడా తక్కువ ఖరీదు కలిగిన మద్యం వైపు వెళ్తారని, అలా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications