కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఇది ఈ రోజు (ఏప్రిల్ 14) ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మరో కీలక ప్రకటన చేస్తారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం లాక్ డౌన్ వంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ పైన ట్రంప్ తొలుత మాట్లాడుతూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. కానీ ఇండియాలో మాత్రం ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రాణాలు ముఖ్యమని భావించి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫలితం కూడా కనిపిస్తోంది.

రూ.8 లక్షల కోట్ల వరకు నష్టం
ఈ లాక్ డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.7 లక్షల నుండి రూ.8 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనాలు వెల్లడవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమని వివిధ సంస్థలు అంచనా వేశాయి.
ప్రపంచంలోకెల్లా ఇదే అతిపెద్ద లాక్ డౌన్. ఈ 3 వారాలు ఫ్యాకర్టీలు, కంపెనీలు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు నిలిచి ప్రజాజీవనం స్తంభించింది.

70 శాతం నిలిచిన ఆర్థిక కార్యకలాపాలు
భారత్‌లో ప్రజా జీవనం స్తంభించడంతో 70% వరకు ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, ఎగుమతులు, వినియోగం నిలిచిపోయాయి. కేవలం నిత్యావసర సరుకులు, సేవలు, గనులు, బ్యాంకింగ్, ఐటీ, కీలక ప్రభుత్వ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఐటీ సేవా సంస్థలు, ఇతర రంగాల్లోని కంపెనీలు అవసరమనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అసంఘటిత రంగంలోని కార్మికులు ఇబ్బందులు పడ్డారు. అయితే కేంద్రం 3 నెలల పాటు ఉచిత బియ్యం, ఉచిత పప్పు, జన్ ధన్ అకౌంట్‌లో రూ.500 వేస్తామని ప్రకటించింది.

అక్యురేట్ అంచనా రోజుకు రూ.35,000 కోట్ల నష్టం
అక్యురేట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా ప్రకారం ఈ 21 రోజుల లాక్ డౌన్ సమయలో ఆర్థిక వ్యవస్థ రోజుకు 464 కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.రూ.35,000 కోట్ల మేరకు నష్టపోయింది. 21 రోజుల్లో జీడీపీకి 9,800 కోట్ల డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) నష్టపోయింది

ఏ రంగంలో ఎంత నష్టం
లాక్ డౌన్ సమయంలోని మొదటి 15 రోజుల్లో దాదాపు రూ.35,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు అఖిల భారత మోటర్ ట్రాన్సుపోర్ట్ కాంగ్రెస్ తెలిపింది. నిర్మాణ రంగం రూ.లక్ష కోట్లు నష్టపోయిందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలిపింది. రిటైల్ రంగానికి కూడా భారీ నష్టమే జరిగింది. 7 కోట్ల చిన్న, మధ్య, భారీ ట్రేడర్లు 45 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నారని గుర్తుచేశారు.

90 శాతం నిలిచిన ట్రక్కులు
దేశంలో దాదాపు కోటి ట్రక్కులు ఉన్నాయి. ఇందులో లాక్ డౌన్ సమయంలో 90 శాతానికి పైగా నిలిచిపోయాయి. లాక్ డౌన్ ఎత్తివేసినా ట్రక్కులకు డిమాండ్ సాధారణ స్థితికి చేరుకునేందుకు మరో రెండు మూడు నెలలు పట్టవచ్చునని అఖిల భారత మోటార్ ట్రాన్సుపోర్ట్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ట్రక్కుకు సరాసరిన రూ.2,200 నష్టం వాటిల్లింది. రోడ్డు రవాణా రంగానికి రూ.32,500 కోట్ల నష్టం వాటిల్లింది.

రియల్ రంగానికి రూ.1 లక్ష కోట్ల నష్టం
రియల్ ఎస్టేట్ రంగానికి రూ.1 లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. గరిష్ట నష్టం ఎంతో కూడా అంచనా వేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పడకేసిన విషయం తెలిసిందే. ఇళ్లు కొనుగోళ్లు, అమ్మకాలు లేక ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి.

రిటైల్ రంగంలో రూ.2.25 లక్షల కోట్ల నష్టం
రిటైల్ రంగానికి రూ.2 లక్షల నుండి రూ.2.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. మార్చి ద్వితీయార్థంలోనే దేశీయ రిటైల్ వర్తక రంగం దాదాపు రూ.2 లక్షల కోట్లు మేర నష్టపోయి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. రిటైల్ రంగంలో 7 కోట్ల మంది చిన్న, మధ్య, బడా స్థాయి వర్తకులు ఉన్నారు. వీరి ద్వారా 45 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. భారత రిటైల్ రంగంలో నెలకు దాదాపు రూ.5.25 లక్షల కోట్లు మేర వ్యాపారం ఉంటోంది.

జీడీపీ వృద్ధి అంచనాలు
భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 1.5 శాతం నుండి 2.8 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంకు ఆదివారం అంచనా వేసింది. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం అత్యంత తక్కువ వృద్ధి రేటు ఇది.
ప్రపంచ బ్యాంకు అంచనా 1.5 శాతం నుండి 2.8 శాతం, ఏడీబీ 4 శాతం, ఎస్ అండ్ పీ 3.5 శాతం, ఫిచ్ రేటింగ్స్ 2 శాతం, ఇండియా రేటింగ్స్ 3.6 శాతం, మూడీస్ 2.5 శాతం, ఆక్యుట్ రేటింగ్స్ 2 శాతం నుండి 3 శాతం, సెంట్రమ్ రీసెర్చ్ 3.1 శాతం వృద్ధిని అంచనా వేసింది. మందగమనం నుండి బయటపడుతున్న కీలక సమయంలో కరోనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications