టెలికాం రంగంలో సంచలనాలకు కేర్ ఆఫ్ అయిన కార్పోరేట్ దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు లాక్ డౌన్ సమయంలోనూ కస్టమర్ల అవసరాలను బట్టి సూపర్ లాక్ డౌన్ ఐడియాతో ముందుకు వచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలా సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్నారు. దీంతో వారికి కావాల్సిన ఇంటర్నెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న రిలయన్స్ జియో సరికొత్త వర్క్ ఫ్రమ్ హోం ప్లాన్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది .

వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్న వారికి స్పెషల్ ప్లాన్
ఇంటి నుంచి పనిచేస్తున్న వారి నెట్ అవసరాలను బట్టి , డేటా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని విడుదల చేసింది రిలయన్స్ జియో . ప్రస్తుతం ఉన్న రూ.2,121 ప్లాన్‌కు అదనంగా రూ.2,399తో మరో దీర్ఘకాలిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇక దీంతో వర్క్ ఫ్రమ్ హోం పని చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డేటా వస్తుంది. దీని కాలపరిమితి 365 రోజులు. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా నిరంతరాయంగా , మంచి స్పీడ్ తో లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2,121 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని కాలపరిమితి కూడా 336 రోజులే.

ఎక్కువ డేటా అవసరాలను బట్టి జియో సరికొత్త ప్లాన్
అలాగే, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారి కోసం రిలయన్స్ జియో రూ. 151, రూ.201, రూ.251 లతో కొన్ని యాడ్ ఆన్ ప్యాక్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. వీటిలో రోజు వారీ డేటా పరిమితి లేదు. ఇక ఇందులో గరిష్టంగా 50 జీబీ వరకు డేటా లభిస్తుంది. డేటాను ఎక్కువగా ఉపయోగించే వారికి ఇవి బాగా ప్రయోజనకరంగా ఉంటాయి. రోజు వారీ డేటా అయిపోయినప్పుడు నెలలో ఏ సమయంలోనైనా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో ఉద్యోగుల అవసరాల మేరకు జియో సూపర్ డేటా ప్యాక్స్ అందిస్తుంది.

టెలికాం రంగంలో ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇస్తున్న జియో
ఇప్పటికే జియో అటు పెట్టుబడులను ఆకర్షిస్తూ టెలికాం రంగంలో సునామి సృష్టిస్తుంది . రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ యాప్ తో ప్రత్యర్థులకు పోటీ ఇస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకునేందుకు రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం పని చేసే వారికి అవసరాలకు తగ్గట్టు ప్రత్యర్ధులు ఇవ్వలేని ప్యాక్స్ అందిస్తూ గట్టి పోటీ ఇస్తుంది.


Click it and Unblock the Notifications