2000 note: రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన అనంతరం.. గతంలో నోట్ల రద్దు సమయంలో అంతటి ఇబ్బంది తలెత్తలేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటో ఓ సర్వేలో తేల్చి చెప్పింది. భారతీయులలో మూడింట రెండు వంతుల మంది ప్రజల వద్ద కనీసం ఒక్క 2 వేల కరెన్సీ నోటు సైతం లేదని అందులో తేలింది. అధిక విలువ కలిగిన నోటు వినియోగం తగ్గుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రకటన సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది.
కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 64 శాతం మంది తమ వద్ద 2 వేల నోటు లేదని తెలిపారు. 6 శాతం మంది తమ వద్ద లక్ష కంటే ఎక్కువ పెద్ద నోటు రూపంలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ సర్వేలో మొత్తం 12 వేల 121 మంది పాల్గొన్నారు. సమాధానమిచ్చిన వారిలో 15 శాతం మంది వద్ద 20 వేల వరకు, 7 శాతం మంది వద్ద 20 నుంచి 40 వేల మధ్య, 6 శాతం మంది దగ్గర 40 వేల నుంంచి లక్ష విలువైన 2 వేల నోట్లు ఉన్నట్లు చెప్పారు.

దేశంలోని 341 జిల్లాల్లోని భారతీయుల నుంచి తమ సర్వేకు 57 వేలకు పైగా స్పందనలు వచ్చినట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది. వారిలో 64 శాతం పురుషులు కాగా మిగిలినవారు మహిళలు. 2 వేల నోటును ఉపసంహరణ కోసం మే 19న RBI ప్రకటన విడుదల చేసిన తర్వాత 91 శాతం మంది విక్రేతలు దానిని అంగీకరించడం కష్టంగా ఉన్నట్లు తన సర్వేలో తేలినట్లు పేర్కొంది.
2 వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించాలన్న RBI నిర్ణయానికి 64 శాతం మంది మద్ధతు తెలుపగా, 22 శాతం మంది వ్యతిరేకించారు. సెప్టెంబర్ 30 తర్వాత ఈ నోటు చట్టబద్ధంగా కొనసాగుతుందని 68 శాతం మంది విశ్వసిస్తున్నారు. అంతే శాతం నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టారు.


Click it and Unblock the Notifications