సొసైటీలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది. కుల వివక్ష, లింగ వివక్ష ఇప్పటికీ ఉంది. లింగ వివక్ష తగ్గుతూ వస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తోంది. వ్యాపారం చేయాలనుకునే పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగిని యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు మీ కోసం..
వ్యాపారం చేయాలనుకునే మహిళలు ఉద్యోగిని యోజన కింద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. పథకంలో ప్రభుత్వం 30 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ బ్యాంక్ రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.

మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. వితంతువులు, వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి. ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
కానీ ఈ ఉద్యోగిని పథకంలో అలా కాదు. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తోంది. మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకు వెళ్లి ఉద్యోగిని యోజన కింద లోన్ తీసుకోవచ్చు. ఇందుకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, అడ్రస్ ఫ్రూప్ ఇతర పత్రాలు బ్యాంకులో అందజేయాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications