ఎకానమీ వేగంగా మారుతున్న తరుణంలో, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఫైనాన్షియల్ రంగంలో కొత్త ఆలోచనలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా NBFCలు భవిష్యతు వృద్ధిపై ఆమె చెప్పిన వాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

నిర్మలా సీతారామన్ చెప్పినట్టు NBFCలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) ఇవ్వగలిగే రుణాల మొత్తం (లోన్ బుక్) ఇప్పటి కన్నా రెట్టింపు చేయాలన్నది లక్ష్యం. ఇది "2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చాలి" అనే దిశలో తీసుకుంటున్న ఒక ముఖ్యమైన అడుగు.
ఈ చర్యలతో NBFCలు తక్కువ వడ్డీ రేట్లతో మార్కెట్‌కు రుణాలు ఇవ్వగలగడం సాధ్యమవుతుంది. దీనివల్ల, సాధారణ వినియోగదారులకు కూడా తక్కువ EMIలు, వేగవంతమైన రుణ ఆమోదం వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.
RBI తాజా చర్యలు:
1. బ్యాంకుల నుంచి NBFCలకు ఇచ్చే రుణాలపై రిస్క్ వెయిటేజెస్‌ను తగ్గించడం
2. ఫండింగ్ ఖర్చులు తగ్గేలా నిబంధనలు సడలించారు
3. రుణాల కొరకు అవసరమయ్యే భద్రత/కోల్యాటరల్‌ను తగ్గించారు
4. మార్జిన్ అవసరాలను తక్కువ చేయడం
5. లిక్విడిటీ అందుబాటును మెరుగుపరచడం
NBFCలు ఏమి చేయాలి?
1. చిన్న వ్యాపారాలు, రైతులు, విద్యార్థులకి సులభంగా రుణాలు ఇవ్వాలి.
2. రుణాల వసూలు (recovery) సమయంలో వినయంగా, న్యాయంగా వ్యవహరించాలి.
3. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సేవలు మెరుగుపరచాలి.
4. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలి.
చిన్న NBFC లకు సవాళ్లు:
చిన్న NBFCలకు పెద్ద సంస్థలతో పోటీ చేయడం సులభం కాదు. వారి వద్ద ఉన్న వనరులు తక్కువగా ఉండటం వల్ల ఎదగడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం వీరి ఎదుగుదలకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అందుబాటులోకి తెచ్చి, వడ్డీ రేట్లు తగ్గించే విధంగా మద్దతు ఇచ్చి, నిబంధనలను సులభంగా మార్చి, మంచి పనితీరు చూపిస్తున్న సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తోంది.
మరోవైపు, RBI కూడా NBFCల నిర్వహణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా డెరివేటివ్ మార్కెట్‌కు సంబంధించిన నియమాలతో డబ్బు అప్పుచేసే సంస్థల మధ్య నమ్మకాన్ని పెంచేందుకు, వినియోగదారులకు నష్టం కాకుండా చూడటానికి చర్యలు తీసుకుంది. ఈ నియమాలు NBFCలు కూడా తప్పనిసరిగా పాటించాల్సివుంటుంది.
కేంద్ర ప్రభుత్వం NBFCలను ఇంకా బలంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా అదే దిశగా నడుస్తోంది. ప్రభుత్వం, RBI తీసుకుంటున్న చర్యల వల్ల NBFCలు తమ సామర్థ్యాన్ని పెంచుకొని మరింత మందికి రుణాలు అందించగలుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సౌకర్యం లేనివారికి ఆర్థిక సహాయం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషించగలగాలి. దీని ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో NBFCలు ముఖ్యమైన భాగస్వాములుగా మారే అవకాశముంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications