PM Surya Ghar: గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సౌరశక్తి(solar energy ) రంగంపై చాలా దృష్టి సారించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్: ఉచిత విద్యుత్ పథకం (PMSGMBY) అనే పథకాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్ టాప్ సోలార్ సిస్టం. ఇళ్లకు ఉచిత విద్యుత్తు అందించడం దీని లక్ష్యం, దీని ద్వారా ఇంటి పైకప్పులపై సౌర సిస్టం ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద, ప్రభుత్వం లబ్ధిదారుల కుటుంబాలకు 3 kW వరకు రెసిడెన్షియల్ రూఫ్ టాప్ సోలార్ (RTS) వ్యవస్థ కోసం దాదాపు 7 శాతం వడ్డీ రేటుతో పూచీకత్తు లేని తక్కువ వడ్డీ రుణాలను అందిస్తుంది. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.78,000 వరకు ఉంటుంది.
పియం సోలార్ ఘర్ స్కిం అర్హత
* ఈ పథకం కోసం దరఖాస్తుదారులు భారతీయ పౌరుడై ఉండాలి.
*దరఖాస్తుదారునికి సౌర సిస్టం ఇన్‌స్టాలేషన్ చేయడానికి అనువైన పైకప్పు ఉన్న ఇల్లు ఉండాలి.
*అలాగే దరఖాస్తుదారులు విద్యుత్ కనెక్షన్ పొంది ఉండాలి.
*దరఖాస్తుదారులు సౌర సిస్టం కోసం మరే ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు.

ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
ఈ పథకం కింద మార్చి 2025 నాటికి సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్‌ల సంఖ్య 10 లక్షలు దాటి, అక్టోబర్ 2025 నాటికి 20 లక్షలు, మార్చి 2026 నాటికి 40 లక్షలు అలాగే మార్చి 2027 నాటికి ఒక కోటికి చేరుకుంటుందని అంచనా.
సబ్సిడీ దరఖాస్తు
మీరు జాతీయ పోర్టల్ ద్వారా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ ఇన్‌స్టాలేషన్ కోసం మీరు నచ్చిన వెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సరైన సోలార్ సిస్టమ్ సైజ్, ప్రాఫిట్ కాలిక్యులేటర్, విక్రేత రేటింగ్‌లు ఇంకా ఇతర సంబంధిత వివరాలపై సమాచారం ద్వారా నిర్ణయం తీసుకోవడంలో జాతీయ పోర్టల్ సహాయం చేస్తుంది.
ప్రయోజనాలు ఏమిటి?
ప్రభుత్వ ఈ ప్రయత్నంతో లబ్ధిదారులు విద్యుత్ బిల్లులపై డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ నుండి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్తును డిస్కామ్‌కు అమ్మడం ద్వారా మీరు కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, 3 kW వ్యవస్థ నెలకు సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు.
ఇప్పటివరకు ఎంత మంది ప్రయోజనం పొందారంటే
ఇటీవల కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద మొత్తం 8.86 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయని తెలియజేశారు. 'రూఫ్‌టాప్' సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా మొత్తం 8.86 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయని రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా న్యూ అండ్ పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి నాయక్ తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications